ధనుష్‌ను కేవలం ఒక తమిళ నటుడిగా చూడరు భారతీయ ప్రేక్షకులు. తెలుగులో ‘సర్’ మూవీతో అతను ఇక్కడి ప్రేక్షకులకూ బాగా దగ్గరయ్యాడు. అంతకంటే ముందు తన అనువాద చిత్రాలు మంచి ఫలితాలు సాధించాయి. మరోవైపు బాలీవుడ్లో ఎప్పుడో జెండా పాతాడు ధనుష్. హిందీలో తన తొలి చిత్రం ‘రాన్ జానా’ సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత చేసిన రెండు సినిమాల్లోనూ ధనుష్‌కు మంచి పేరొచ్చింది.
కానీ ‘రాన్ జానా’ నటుడిగా అతణ్ని ఇప్పటికీ గుర్తుంచుకుంటారు అక్కడి జనం. ఆ సినిమా వచ్చిన దశాబ్దం తర్వాత.. మళ్లీ అలాంటి సినిమా ఒకటి చేయబోతున్నాడు ధనుష్. ఈ తమిళ నటుడిని ఎంతగానో ఇష్టపడే బాలీవుడ్ దర్శక నిర్మాత ఆనంద్.ఎల్.రాయ్.. తనతో మూడో సినిమా చేయబోతున్నాడు. అదే.. తేరే ఇష్క్ మే.
‘రాన్ జానా’ తరహాలోనే ఈ సినిమా కూడా ఉండబోతోంది. ఈ చిత్రంలో ధనుష్ సరసన కృతి శెట్టి కథానాయికగా నటించనుంది. ‘రాన్ జానా’కు అద్భుతమైన సంగీతం అందించిన ఏఆర్ రెహమాన్ సైతం ఈ ప్రాజెక్టుకు పని చేయబోతున్నాడు. మళ్లీ రాన్‌జానా ప్రపంచంలోకి రమ్మని ఆహ్వానిస్తూ.. రెండు టీజర్లను వదిలింది చిత్ర బృందం. ధనుష్‌ను శంకర్‌గా, కృతిని ముక్తిగా పరిచయం చేస్తూ రెండు ఇంట్రో టీజర్లు డిజైన్ చేశారు. అవి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.
రెండింట్లోనూ విజువల్స్ అదిరిపోయాయి. డైలాగులు బాగున్నాయి. రెండు పాత్రల మీద ప్రేక్షకుల్లో స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ధనుష్, కృతిల లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంది. అన్నింటికీ మించి ఏఆర్ రెహమాన్ అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్‌తో తన వింటేజ్ ఫామ్‌ను గుర్తు చేశాడు. ధనుష్-ఆనంద్-రెహమాన్ త్రయం మరోసారి వెండితెరపై అద్భుతాన్ని ఆవిష్కరించబోతున్న సంకేతాలను ఈ టీజర్లు ఇచ్చాయి. ఈ ఏడాది చివర్లో ‘తేరే ఇష్క్ మే’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on January 28, 2025 6:35 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…