బింబిసార దర్శకుడు వశిష్ట, చిరంజీవి కలయికలో రూపొందుతున్న విశ్వంభర షూటింగ్ చివరి దశలో ఉండటంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఏ దశలో ఉందనేది నిర్మాతలు బయటికి చెప్పడం లేదు. సరే దీని సంగతలా ఉంచితే ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న అసలు విషయం వేరే ఉంది.
గేమ్ ఛేంజర్ కోసం సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నట్టు ప్రకటించిన మెగా టీమ్ ఇంకా ఇంత వర్క్ పెండింగ్ పెట్టుకోవడం విచిత్రమే. టీజర్ కొచ్చిన నెగటివ్ ఫీడ్ బ్యాక్ దృష్టిలో ఉంచుకుని విఎఫ్ఎక్స్ టీమ్ మొత్తాన్ని మార్చారనే వార్తల నేపథ్యంలో రిలీజ్ డేట్ గురించి తర్జనభర్జనలు జరుగుతున్నాయి.
ప్రాథమికంగా విశ్వంభర లాక్ చేసుకున్న తేదీ మే 9. జగదేకవీరుడు అతిలోకసుందరి, గ్యాంగ్ లీడర్ లాంటి బ్లాక్ బస్టర్స్ వచ్చిన డేట్ కాబట్టి సెంటిమెంట్ గానూ బాగుంటుందనేది యూనిట్ అభిప్రాయం. ఒకవేళ అదే అనుకుంటే ముందైతే అనౌన్స్ మెంట్ ఇవ్వడం అవసరం.
ఎందుకంటే చాలా భారీ సినిమాలు స్లాట్స్ కోసం వెతుక్కుంటున్న టైంలో లేట్ గా ప్రకటన ఇవ్వడం వల్ల విమర్శలకు తావిచ్చినట్టవుతుంది. అందుకే వీలైనంత త్వరగా ఏదో ఒకటి తేల్చడం బెటర్. తాజాగా పాటల రికార్డింగ్ ఫోటోలు పెట్టిన వశిష్ట మొన్న ఖైదీలో కొండపల్లి సీన్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసుకుని ఉత్సుకత రేపాడు.
అసలే హరిహర వీరమల్లు మార్చ్ 28 వస్తుందా రాదానే అనుమానంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సతమతమవుతున్నారు. పోస్టర్లలో వాయిదా లేదని నొక్కి చెబుతున్నారు కానీ అదే డేట్ కి రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్, కాళీ లాంటివి రావడం చూస్తే కొత్త డౌట్లు పుట్టుకొస్తున్నాయి.
దీనికి విశ్వంభరకు సంబంధం లేకపోయినా రెండింటి మధ్య కనీసం ఏడెనిమిది వారాలు గ్యాప్ ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. ముందైతే విశ్వంభర కొత్త ప్రమోషన్లు మొదలుపెట్టడం అవసరం. హైప్ పెంచాలంటే కంటెంట్ ఎక్స్ ట్రాడినరిగా ఉందనే నమ్మకం కలిగించాలి. యువి క్రియేషన్స్ మెగాస్టార్ కెరీర్లోనే భారీ బడ్జెట్ దీని మీద పెట్టింది.
This post was last modified on January 28, 2025 5:35 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…