రొటీన్ సినిమాలు తీస్తాడని విమర్శించొచ్చు.. పాత సినిమాలనే అటు ఇటు తిప్పి కిచిడీ కథలు తయారు చేస్తారని ఎద్దేవా చేయొచ్చు.. కొత్తదనం రవ్వంతైనా ఉండదని తీసిపారేయొచ్చ.. కానీ ఇండియాలో మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అట్లీ ఒకడు. తొలి చిత్రం ‘రాజా రాణి’ నుంచి చివరగా హిందీలో షారుఖ్ ఖాన్‌తో తీసిన ‘జవాన్’ వరకు అన్నీ బ్లాక్ బస్టర్లే అయ్యాయి. ‘జవాన్’ రిలీజై ఏడాదిన్నర దాటిపోగా.. ఇంకా తన కొత్త చిత్రం మాత్రం ప్రకటించలేదు.
తన ఆరో సినిమాలో హీరో అంటూ చాలా పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఆ ప్రచారాలేవీ నిజం కాలేదు. ఐతే ఇప్పుడు అట్లీ ఓ మెగా మల్టీస్టారర్‌కు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా వస్తున్న వార్తలు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్.. బాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడైన సల్మాన్ ఖాన్‌ల క్రేజీ కాంబినేషన్లో అట్లీ సినిమా తీయబోతున్నాడట. రజినీకాంత్, సల్మాన్ ఖాన్.. వీరిలో ఏ ఒక్కరితో అట్లీ సినిమా అనౌన్స్ చేసినా హైప్ మామూలుగా ఉండదు.
అలాంటిది ఈ ఇద్దరు సూపర్ స్టార్లను కలిపి మల్టీస్టారర్ అంటే దీని మీద అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పేదేముంది. వేరే హీరోల సినిమాల్లో సల్మాన్ క్యామియోలు చేయడం మామూలే. కానీ ఆయన మల్టీస్టారర్ చేసి చాలా కాలం అయింది. రజినీ కూడా 80వ దశకం వరకు మల్టీస్టారర్లు, క్యామియోలు చేశాడు కానీ.. తర్వాత చాలా వరకు సోలో హీరోగానే సినిమాలు చేస్తూ వచ్చాడు. ‘కథానాయకుడు’ ఒకటి మినహాయింపు.
మరి కెరీర్లో ఈ దశలో రజినీ, సల్మాన్ కలిసి సినిమా చేయడానికి ఒప్పుకోవడమే పెద్ద విశేషం అవుతుంది. ఈ వార్త నిజం అయితే మాత్రం ఇది ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ మూవీస్‌లో ఒకటిగా మారే అవకాశముంది. మరి అట్లీ నుంచి ఏం ప్రకటన వస్తుందో చూడాలి.
This post was last modified on January 28, 2025 4:31 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…