కొన్ని నెలల కిందట తమిళ నటులు నయనతార-ధనుష్ మధ్య గొడవ సోషల్ మీడియాను ఎలా కుదిపేసిందో తెలిసిందే. తన వ్యక్తిగత జీవితం, ఫిలిం కెరీర్ నేపథ్యంగా నెట్ ఫ్లిక్స్ కోసం రూపొందించిన ‘నయనతార: బియాండ్ ద ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీ కోసం ధనుష్ ప్రొడ్యూస్ చేసిన ‘నానుం రౌడీ దా’ సినిమా నుంచి ఫుటేజ్ వాడుకోవడానికి అంగీకరించకపోవడాన్ని తప్పుబడుతూ, ధనుష్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ నయన్ రాసిన బహిరంగ లేఖ వైరల్ అయింది.
ఈ వివాదంలో కొందరు ధనుష్‌ను తప్పుబడితే.. ఇంకొందరు నయన్‌ను నిందించారు. కొన్ని రోజుల పాటు దీని మీద పెద్ద చర్చే జరిగింది. ధనుష్ ఈ వివాదం మీద ఏమైనా స్పందిస్తాడేమో అని అంతా ఎదురు చూశారు. కానీ కొన్ని రోజులు మౌనంగా ఉన్న ధనుష్.. ఆపై కోర్టు మెట్లు ఎక్కాడు. నయన్ డాక్యుమెంటరీలో ‘నానుం రౌడీ దా’ ఫుటేజ్ వాడడంతో అతను నయన్, విఘ్నేష్‌ల మీద దావా వేశాడు. ఈ పిటిషన్‌ను కోర్టు విచారణకు కూడా స్వీకరించింది.
దీని మీద ధనుష్ పేరెత్తకుండా నయన్ కౌంటర్ కూడా వేసింది. ఈ వివాదం విషయంలో తర్వాత ఏ అప్‌డేట్ లేదు. ఐతే ఇప్పుడు కోర్టులో ధనుష్.. నయన్ మీద పైచేయి సాధించాడు. ధనుష్ పిటిషన్‌ను కొట్టివేయాలంటూ నెట్ ఫ్లిక్స్ వేషిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టేసింది. దీంతో ఈ వ్యవహారంలో నయన్‌కు, నెట్‌ఫ్లిక్స్‌కు చిక్కులు తప్పవని స్పష్టమవుతోంది. నయన్ డాక్యుమెంటరీలో ‘నానుం రౌడీ దా’కు సంబంధించి కొన్ని సెకన్ల ఫుటేజీని మాత్రమే వాడారు.
అయినా ధనుష్ అంత అభ్యంతర పెట్టాల్సిన అవసరం ఏముంది అనే ప్రశ్నలు తలెత్తాయి. కానీ దీని వెనుక వేరే గొడవ ఉందని తెలుస్తోంది. ‘నానుం రౌడీ దా’ సినిమా బడ్జెట్‌ను బాగా పెంచేసి ధనుష్‌ను నయన్ భర్త విఘ్నేష్ చిక్కుల్లోకి నెట్టాడని.. తర్వాత ధనుష్ అంటే లెక్కలేనట్లు వ్యవహరించాడని ఓ వాదన తెరపైకి వచ్చింది.
ఐతే ధనుష్ కోసం ఒకప్పుడు ‘ఎదిర్ నీచ్చిల్’ సినిమాలో నయన్ ఫ్రీగా ఐటెం సాంగ్ చేసిందని.. అలాంటి అమ్మాయితో ఇలా వ్యవహరించడం ఏంటని ఆమె మద్దతుదారులు ధనుష్‌ను తప్పుబడుతున్నారు. మరి ఈ వివాదం ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.
This post was last modified on January 28, 2025 4:23 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…