రాత్రి పదకొండు గంటల తర్వాత పదహారేళ్ళ లోపు పిల్లలను థియేటర్లలో అనుమతించకుండా చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి కోర్టు సూచించడం గురించి పరిశ్రమలో చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ నిజంగా ఇది అమలులోకి వస్తే కలిగే ఇబ్బందులను బేరీజు వేసుకునే పనిలో ఎగ్జిబిటర్లున్నారు.
హైదరాబాద్ లాంటి పెద్ద నగరాలు మినహాయించి దాదాపు అన్ని కేంద్రాల్లో రాత్రి పది నుంచి పదిన్నర మధ్యలో సెకండ్ షో మొదలైపోతోంది. ఏదైనా పండగ లేదా పెద్ద హీరోల రిలీజ్ ఉన్నప్పుడు మాత్రమే లేట్ నైట్ షోలు ఉంటాయి కానీ మిగిలిన రోజుల్లో అసలా అవసరమే లేదు.
అలాంటప్పుడు ఇదో పెద్ద సమస్య కాదనేది డిస్ట్రిబ్యూటర్ల ఆలోచన. మల్టీప్లెక్సుల్లో మాత్రమే సాధారణంగా 11 గంటల షోలు ఉంటాయి. ఎప్పుడో రెండు గంటలకు బయటికి వచ్చే అలాంటి సినిమాలకు ఫ్యామిలీస్ పిల్లల్ని తీసుకెళ్లడం తక్కువ. వీకెండ్ లో మాములే.
ఒకవేళ నిజంగా కట్టడి చేయాల్సి వస్తే మల్టీప్లెక్సులు యాజమాన్యాలకు ఇది ప్రాబ్లెమ్ కాదు. ఎందుకంటే ఇప్పటికే ఏ సర్టిఫికెట్ ఉన్న సినిమాల విషయంలో నిబంధనలను కఠినంగా పాటిస్తున్నాయి కాబట్టి. సో దీన్ని మేనేజ్ చేసుకుంటారు. ఇక సింగల్ స్క్రీన్లు సిబ్బంది కొరత దృష్ట్యా పది లోపే చివరి ఆట వేస్తాయి కనక టెన్షన్ లేదు.
ఎలా చూసుకున్నా ఇది తీవ్రంగా ఆలోచించాల్సిన మ్యాటర్ కాదు. కాకపోతే ఇప్పటికే మిడ్ నైట్ షోల నియంత్రణ, ఫ్యాన్స్ సెలబ్రేషన్ల మీద ఆంక్షల వల్ల థియేటర్లు కొంత ప్రతికూల ప్రభావం చూస్తున్నప్పటికీ మంచి ఫలితాల దిశగా అమలవుతున్న సంస్కరణలు కాబట్టి క్రమంగా అలవాటు చేసుకోవాలి.
ప్రస్తుతానికి ఇది తెలంగాణకే పరిమితమైన వ్యవహారమే అయినా భవిష్యత్తులో ఆంధ్ర ప్రదేశ్ లోనూ ఇలాంటి మార్పులు చూసే అవకాశం లేకపోలేదు. చిన్న కొసమెరుపు ఏంటంటే పదకొండు తర్వాత నో ఎంట్రీ అన్నారు కనక చివరి షో పది గంటల యాభై అయిదు నిమిషాల వరకు వేసే ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని వాడుకోవచ్చు.
This post was last modified on January 28, 2025 10:54 am
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…
అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ).. తాజాగా మరో ఉద్యమానికి తెరదీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…
హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్రమించేవారు కొందరైతే.. తాము చేసిన పనుల కారణంగా చూపిన ధైర్య సాహసాల కారణంగా రాత్రికి…
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…