అందని ఎత్తులో ఉన్న వాళ్ళను లక్ష్యంగా చేసుకునే బ్యాచ్ సోషల్ మీడియాలో అంతకంతా పెరుగుతోంది. దానికి దర్శక ధీర రాజమౌళి మినహాయింపు కాదు. ఇటీవలే ప్రకటించిన పద్మ పురస్కార విజేతలకు శుభాకాంక్షలు అందజేస్తూ ఆయన వేసిన ట్వీట్ మీద పెద్ద ఎత్తున చర్చ జరగడం మహా విచిత్రం.
అంతగా అందులో ఏముందంటే సందేశం మొదట్లో 7 తెలుగు పీపుల్స్ థిస్ టైం అని పెట్టారు. అంటే ఏడుగురు మనవాళ్ళు పద్మ గౌరవాన్ని అందుకున్నారని అర్థం. ఇది కొందరికి తప్పుగా అనిపించిందట. కేంద్ర ప్రభుత్వం భాషల వారీగా భేదం చూపించలేదు కాబట్టి ప్రత్యేకంగా తెలుగు అని వాడకూడదని సదరు మేధావుల లాజిక్.
నిజానికి అక్కడ తప్పు బట్టేందుకు ఏమి లేదు. ఎందుకంటే రాజమౌళి పక్కా తెలుగువాడు. ఎన్ని వందల వేల కోట్లు పెట్టినా టాలీవుడ్ హీరోలతోనే తీస్తాడు. హిందీ తమిళం ఏదైనా సరే ఆ లాంగ్వేజ్ లో డబ్బింగ్ చేయిస్తాడు తప్పించి రెండు మూడు వెర్షన్లు తీసే అవసరం లేని రిస్కులు తీసుకోడు.
పలు సందర్భాల్లో జక్కన్న దీని గురించి చాలా స్పష్టంగా వివరించాడు. మనం పుట్టిపెరిగిన నేల నుంచి ఎవరైనా ఏదైనా సాధిస్తే మనం గర్వపడతాంగా. ఆ మాటకొస్తే విదేశీ, ఇతర రాష్ట్రాల ఆటగాళ్ళున్నా ఐపీఎల్ లో సన్ రైజర్స్ టీమ్ కు మద్దతు ఎందుకు ఇస్తాం. కేవలం హైదరాబాద్ కనెక్షన్ ఉందన్న ఒకే కారణంతో.
అలాంటిది రాజమౌళి తెలుగు వాళ్ళ గురించి గర్వంగా ఫీలవ్వడంతో తప్పేముందో అంతు చిక్కడం లేదు. మరి ధనుష్ ప్రత్యేకంగా అజిత్ ని పొగిడి సాటి తమిళవాడిగా గర్వపడుతున్నానని చెప్పినప్పుడు రాంగ్ అనిపించలేదు. కేవలం రాజమౌళి తెలుగు పీపుల్ అనడం దగ్గరే సమస్య కనిపిస్తోంది. ఇది మరీ విచిత్రం.
ఆర్ఆర్ఆర్, బాహుబలితో టాలీవుడ్ ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన జక్కన్న ఇవన్నీ పట్టించుకోడు కానీ ఆయన అందరికీ శుభాకాంక్షలు చెప్పడం మర్చిపోకూడదు. అయినా కేవలం ఒక ఇన్స్ టా పోస్టుతో మీడియాని ఊపేసిన రాజమౌళిని విమర్శించడమంటే ఆకాశంలో రాళ్ళేయడమే. తిరిగి వేసినోళ్లకే పడతాయి.
This post was last modified on January 27, 2025 3:34 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్‌పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…