మూడేళ్ళ క్రితం చిరంజీవి గాడ్ ఫాదర్ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడానికి ప్రధాన కారణం ఒరిజినల్ వెర్షన్ లూసిఫర్ లో ఉన్న ఆత్మని సరిగ్గా ఒడిసిపట్టుకోలేకపోవడం. సెకండాఫ్ లో చేసిన మార్పులు కూడా కొంత డ్యామేజ్ కి కారణమయ్యాయి. అయితే అంతకు ముందే లూసిఫర్ తెలుగు డబ్బింగ్ ఓటిటిలో చూసేసిన మన ప్రేక్షకులు మోహన్ లాల్ దే బెటరనే అభిప్రాయానికి వచ్చారు.
అందుకే ఈసారి రీమేక్ గొడవ లేకుండా సీక్వెల్ ని అనువాద రూపంలో తీసుకొస్తున్నారు. ఇవాళ కేరళలో జరిగిన గ్రాండ్ టీజర్ లాంచ్ వివిధ బాషల నుంచి మీడియా ప్రతినిధులను తీసుకెళ్లి ఘనంగా నిర్వహించారు.
లూసిఫర్ లో కూలిపోయిన రాజకీయ సామ్రాజ్యాన్ని నిలబెట్టే స్టీఫెన్ గట్టుపల్లి (మోహన్ లాల్) కి విదేశాల్లో ఒక మాఫియా డాన్ గా ఇంకో పేరు ఉంటుంది. అదే అబ్రహం ఖురేషి. పలు అంతర్జాతీయ సంస్థలు అతన్ని పట్టుకోవడానికి పధకాలు వేస్తూ ఉంటాయి.
అయితే ఎక్కడో కేరళలో సిఎం దత్త పుత్రుడిగా ఉన్న స్టీఫెన్ అంత పెద్ద స్థాయికి ఎలా వెళ్ళాడు, మళ్ళీ ప్రమాదంలో పడ్డ తోబోట్టువు (మంజు వారియర్) ని ఎలా కాపాడుకున్నాడనే పాయింట్ దర్శకుడు కం నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ ఈ ఎల్ 2 ఎంపురన్ లో చూపించబోతున్నాడు. ఈసారి విదేశాల్లోనూ ఎక్కువ శాతం షూటింగ్ చేశారు.
విజువల్స్, కంటెంట్ చాలా భారీగా ఉన్నాయి. టోవినో థామస్ ఉన్నాడో లేదో రివీల్ చేయలేదు కానీ మొత్తానికి అంచనాలు పెంచడంలో పృథ్విరాజ్ సక్సెసయ్యాడు. స్టోరీకి సంబంధించి ఎక్కువ క్లూస్ ఇవ్వకుండా మేనేజ్ చేశారు కాబట్టి ట్రైలర్ వచ్చేదాకా ఎదురు చూడాలి.
మార్చి 27 విడుదల కాబోతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ని అయిదు భాషల్లో విడుదల చేయబోతున్నారు. గాడ్ ఫాదర్ యావరేజ్ అయ్యింది కాబట్టి దీన్ని మెగాస్టార్ రీమేక్ చేయడం జరగకపోవచ్చు. విక్రమ్ వీరధీర సూరన్ పార్ట్ 2తో పోటీ పడుతున్న ఎల్2 ఎంపురన్ ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సుభాస్కరన్ పెద్ద బడ్జెట్ తో నిర్మించారు.
This post was last modified on January 26, 2025 7:55 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…