ఒక్కో జానర్‌కు ఒక్కో రీచ్ ఉంటుంది. కొన్ని జానర్ల సినిమాలకు వసూళ్ల పరంగా పరిమితులు కూడా ఉంటాయి. వందల కోట్ల వసూళ్లు సాధించాలంటే అందులో టాప్ స్టార్లు నటించాలి. అది ఈవెంట్ ఫిలిం అయ్యుండాలి. పాన్ ఇండియా అప్పీల్ ఉన్న సినిమా అయ్యుండాలి అనే అభిప్రాయాలు అందరిలోనూ ఉంటాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్లు ఒక స్థాయికి మించి వసూళ్లు రాబట్టలేవు అనే అభిప్రాయం బలంగా వినిపిస్తుంటుంది. కానీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా మాత్రం ఈ లెక్కలన్నింటినీ మార్చేసింది.
విక్టరీ వెంకటేష్ ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడు. ఆయనకు ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి. కానీ 2000 అనంతరం తర్వాతి తరం స్టార్ల జోరు ముందు ఆయన నిలవలేకపోయారు. చాలా ఏళ్ల నుంచి ఆయన మిడ్ రేంజ్ సినిమాలే చేస్తున్నారు. వాటి బడ్జెట్లు, బిజినెస్, వసూళ్లు అన్నీ కూడా ఒక స్థాయిలోనే ఉంటున్నాయి. ఈ సంక్రాంతికి షెడ్యూల్ అయిన ఆయన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’కు మంచి బజ్ వచ్చినా సరే.. మరీ అలవోకగా వంద, రెండొందల కోట్ల వసూళ్లను దాటేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు.
మూడు రోజుల్లో వంద కోట్లు.. వారం తిరిగేసరికి రూ.200 కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేయడం అనూహ్యం. ప్రస్తుతం ఈ సినిమా వసూళ్లు రూ.250 కోటల మార్కును కూడా దాటేసి.. లేటెస్ట్‌గా రూ.260 కోట్ల దగ్గర ఉన్నాయి. 12 రోజుల్లోనే ఈ సినిమా ఈ మార్కును టచ్ చేసింది. ఇక రూ.300 కోట్ల మైలురాయిని అందుకోవడం అన్నది లాంఛనమే.
రూ.50 కోట్లకు అటు ఇటుగా బడ్జెట్లో తెరకెక్కిన ఒక ఫ్యామిలీ సినిమా.. కేవలం థియేట్రికల్ రన్ ద్వారానే రూ.300 కోట్ల మైలురాయిని అందుకోవడం అన్నది చిన్న విషయం కాదు. రెండో వీకెండ్లో కూడా ఒక కొత్త చిత్రంలా ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది. గత 24 గంటల వ్యవధిలో బుక్ మై షోలో లక్షన్నరకు పైగా టికెట్లు తెగాయంటే ఈ సినిమా ఊపు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
This post was last modified on January 26, 2025 5:39 pm
భారత క్రికెట్ అభిమానుల ఆశలపై మరోసారి మబ్బులు కమ్ముకున్నాయి. త్వరలో పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరగబోయే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి…
ప్రజా గాయకుడు గద్దర్ కు పద్మ అవార్డుల వ్యవహారంలో ఘాటు వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్… బీజేపీ,…
వైసీపీ కీలక నేత వేణుంబాక విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానంటూ ప్రకటించి కలకలం రేపారు కదా. ప్రకటించినట్లుగానే ఆయన తన…
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలలు గడుస్తున్నా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం లేదని వైసీపీ నేతలు…
ఏపీలో కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత.. రాష్ట్రానికి పోయిన పేరును తీసుకువచ్చేందుకు.. గత ప్రాభవం నిలబెట్టేందుకు కూటమి పార్టీలు…
అప్పుడెప్పుడో ఇంగ్లాండ్ మ్యాచ్ లో యువరాజ్ సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టినట్టు బాక్సాఫీస్ వద్ద సంక్రాంతికి వస్తున్నాం…