తాజాగా ప్రకటించిన పద్మ పౌర పురస్కారాల్లో తెలుగు సినీ రంగానికి గొప్ప గౌరవమే దక్కింది. నందమూరి బాలకృష్ణను మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ వరించింది. బాలయ్యకు ఈ అవార్డు రాబోతున్నట్లు కొన్ని నెలల ముందే ఓ ప్రచారం నడిచింది. ఏపీ ప్రభుత్వం బాలయ్యను పద్మభూషణ్ కోసం నామినేట్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు బాలయ్యకు ఆ అవార్డు రావడంతో అప్పటి వార్తలు నిజమేనని తేలింది.
బాలయ్యకు ఈ పురస్కారం దక్కడం పట్ల సినీ పరిశ్రమలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య అభినందనల వర్షంలో తడిసి ముద్దవుతున్నారు. నటుడిగా ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు చేసి, అద్భుతమైన పాత్రలు పోషించడమే కాక.. మూడుసార్లు హిందూపురం ఎమ్మెల్యేగా, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్‌గా బాలయ్య చేస్తున్న సేవ అసామాన్యమైనది. కాబట్టి ఆయనకు ఈ అవార్డు ఇవ్వడం సముచితమే.
ఇదిలా ఉంటే.. బాలయ్యకు సినీ పరిశ్రమ నుంచి కేవలం అభినందనలతో సరిపెట్టేస్తారా అన్నది ఇప్పుడు ప్రశ్న. ఆయనకు ఇండస్ట్రీ తరఫున కచ్చితంగా ఓ పెద్ద సన్మాన సభ ఏర్పాటు చేయాల్సిందే. సినీ ప్రముఖులకు పద్మశ్రీలు రావడం మామూలే కానీ.. పద్మభూషణ్ అంటే అరుదైన అవార్డే. గతంలో మెగాస్టార్ చిరంజీవి ఈ పురస్కారాన్ని అందుకున్నపుడు టాలీవుడ్ తరఫున భారీ సన్మాన వేడుక చేశారు. దానికి సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
మరి బాలయ్యకు కూడా ఇప్పుడు అలాంటి సన్మాన సభ ఏర్పాటు చేయాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది బాలయ్య 50 ఏళ్ల సినీ వేడుకను పరిశ్రమ తరఫున చేశారు కానీ.. అది అనుకున్నంత పెద్దగా జరగలేదు. మీడియాలో కూడా దాని గురించి పెద్దగా చర్చ లేదు. కానీ ఇప్పుడు పద్మభూషణ్ పురస్కారం నేపథ్యంలో మాత్రం బాలయ్యను ఇండస్ట్రీ సముచితంగా గౌరవించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
This post was last modified on January 26, 2025 5:34 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…