పుష్పరాజ్ రూటులోనే దేవర?

దేవర 1 కి మొదట వచ్చిన టాక్ తో ఎక్కడ డిజాస్టర్ అవుతుందో అని మేకర్స్ కాస్త కంగారు పడ్డారు. నిజానికి కొరటాల రెగ్యులర్ వర్క్ కన్నా అనిరుధ్ పనితనం, ఎన్టీఆర్ మాస్ క్రేజ్ సినిమాకు ప్రధాన ఆయుధాలుగా నిలిచి సినిమాను ప్రాఫిట్ లోకి తెచ్చాయి. ఇక దేవర 2 వస్తుందా లేదా అనే విషయంలో మేకర్స్ ఇప్పటివరకు సరైన క్లారిటీ ఇవ్వకపోవడం ఆశ్చర్యం. దేవర 1కు నార్త్ లో క్రేజ్ బాగానే వచ్చింది.

ఇక లేటెస్ట్ గా పుష్ప 2 మాస్ ఎలివేషన్స్ తోనే ఒక రేంజ్ లో క్లిక్కవడం తో కొరటాల దేవర 2పై ఆశలు చిగురించినట్లు తెలుస్తోంది. పుష్ప 2 ఏకంగా 1800 కోట్లు కలెక్ట్ చేయడం అలాగే హిందీలో 800 కోట్లు దాటడంతో పాన్ ఇండియా మాస్ హీరోల ఫోకస్ మరింత పెరిగింది. ఇక దేవర 2 స్క్రిప్ట్ విషయంలో ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకొని ప్లాన్ చేసుకుంటే వెయ్యి కోట్లు గ్యారెంటీ అని మేకర్స్ ఆలోచనలో పడ్డట్లు టాక్.

పుష్ప 1 కి అలాగే పుష్ప 2కి వచ్చిన కలెక్షన్స్ వ్యత్యాసాలను అందరూ గమనిస్తున్నారు. కాస్త క్లిక్కయిన క్యారెక్టర్ మరోసారి కరెక్ట్ గా దింపగలిగితే హై రేంజ్ లో క్లిక్కవచ్చు అనే ఆశతో ఉన్నారు. ఇక కొరటాల పాన్ ఇండియా సినిమా చేసిన తర్వాత మరో పెద్ద హీరోతో చేస్తేనే స్టార్ డైరెక్టర్స్ లీగ్ లో ఉండవచ్చు. అయితే ప్రస్తుతం పెద్ద హీరోలెవరు డేట్స్ ఇచ్చే పరిస్థితులో లేరు కాబట్టి కొరటాలకు తారక్ కంటే బెస్ట్ అప్షన్ మరొకరు లేరు.

దేవర 2ని పుష్ప 2 రేంజ్ లో క్లిక్కయ్యేలా చేయడమే ఆయనకున్న బెస్ట్ అప్షన్. కాబట్టి స్క్రిప్ట్ తో ఎన్టీఆర్ కు నమ్మకం కలిగించాలి. ప్రస్తుతం కొరటాల తన టీమ్ తో కలిసి దేవర 2ని మొదట అనుకున్న స్టోరీ కంటే మరింత గ్రాండియర్ గా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా పుష్పరాజ్ బాక్సాఫీస్ మాయలో ఇప్పుడు చాలామంది ఉన్నారు. అందులో దేవర 2 కూడా ఉన్నాడు. మరి కొరటాల ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.