తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక బెనిఫిట్ షోలను ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకునే స్వేచ్ఛ లభించింది నిర్మాతలకు. పెద్ద సినిమాలకు అర్ధరాత్రి నుంచి షోలు వేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా సాగింది. కానీ ఇదంతా ‘పుష్ప-2’ సినిమా విడుదల వరకే. ఆ చిత్రానికి ముందు రోజు రాత్రి నుంచి పెయిడ్ ప్రిమియర్స్ పడిపోయాయి. అర్ధరాత్రి షోలూ రన్ అయ్యాయి. కానీ సంధ్య థియేటర్ ఘటన తర్వాత మొత్తం పరిస్థితి మారిపోయింది.
అర్ధరాత్రి షోలు అంతర్ధానం అయిపోయాయి. సంక్రాంతి సినిమాలకు తెల్లవారుజామునే షోలు పడ్డాయి. కానీ ఇకపై అవి కూడా పడడం కష్టమే. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వొద్దని హైకోర్టు తాజాగా స్పష్టం చేయడమే అందుకు కారణం. సినిమా టికెట్ల ధరల పెంపు, స్పెషల్ షోల అనుమతికి సంబంధించి ఓ పిటిషన్‌పై హైకోర్టులో తాజాగా విచారణ జరిగింది. ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.
సినిమాలకు టికెట్ల ధరలను పెంచుతూ ఇచ్చిన అనుమతులను ప్రభుత్వం రద్దు చేసినట్లు న్యాయస్థానానికి వివరించారు. ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు.. కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం చేసిన సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం అర్ధరాత్రి 1.30 గంటల నుంచి ఉదయం 8.40 గంటల మధ్య ఎలాంటి స్పెషల్ షోలకు అనుమతి వద్దని.. ఈ చట్టాన్ని పాటించాలని ఆదేశించింది.
తదుపరి విచారణను వచ్చేనెల 21వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. దీంతో తెలంగాణలో అర్ధరాత్రి, తెల్లవారుజామున స్పెషల్ షోలు రద్దయినట్టే భావించాలి. మరి పెద్ద సినిమాలకు ఉదయం 8.40 లోపు షోలకు అనుమతి లేదంటే ఇండస్ట్రీ జనాలు లబోదిబోమనడం ఖాయం. అలాగే అభిమానులకూ ఇది నిరాశ కలిగించే విషయమే.
This post was last modified on January 25, 2025 3:39 pm
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన…
ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా ఒక వెలుగు వెలిగిన బాలయ్య.. ‘నరసింహనాయుడు’తో ఇండస్ట్రీ హిట్ కొట్టాక చాలా ఏళ్ల…
'కేజీఎఫ్’, ‘కేజీఎఫ్-2’ చిత్రాలతో కన్నడ నటుడు యశ్ ఎంత పెద్ద స్టార్‌గా ఎదిగిపోయాడో తెలిసిందే. ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా…
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ లో రాజమౌళి తర్వాత వినిపిస్తున్న పేరు అనిల్ రావిపూడినే. జక్కన్న ప్యాన్ ఇండియా…
సినిమా కోసం ఎన్ని వందల కోట్ల బడ్జెట్ పెట్టినా పైసా ఖర్చు లేకుండా మార్కెటింగ్ చేసుకోవడంలో రాజమౌళిని మించిన వారు…
వచ్చే నెల ఫిబ్రవరి 14 విడుదల కాబోతున్న చావా మీదున్న అంచనాలు ట్రైలర్ వచ్చాక రెట్టింపయ్యాయి. విక్కీ కౌశల్ టైటిల్…