వరుస బ్లాక్ బస్టర్లలో ఊపుమీదున్నాడు నందమూరి బాలకృష్ణ. ఆయన దశ తిరిగేలా చేసిన సినిమా.. అఖండనే. ఆ సినిమా ఎవ్వరూ ఊహించని స్థాయిలో విజయాన్నందుకుంది. ఆ తర్వాత వరుసగా వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ చిత్రాలతో విజయాలు ఖాతాలో వేసుకున్నారు బాలయ్య. ఈ ఊపులో ఇప్పడు అఖండ సీక్వెల్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆరంభ దశలో ఉంది. ఇటీవలే మహా కుంభమేళాకు వెళ్లి కొన్ని సన్నివేశాలు షూట్ చేసుకుని వచచాడు దర్శకుడు బోయపాటి శ్రీను.
తర్వాతి షెడ్యూల్ కోసం ఆయన లొకేషన్ వేటలో ఉన్నారు. ఈలోపు ఈ ప్రాజెక్టులోకి క్రేజీ అడిషన్ యాడ్ అయింది. తక్కువ సమయంలోనే తెలుగులో మంచి విజయాలు అందుకుని లక్కీ ఛార్మ్ అని పేరు తెచ్చుకున్న సంయుక్త మీనన్ అఖండ-2లో నటించబోతోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు కూడా. ఐతే సంయుక్త అఖండ-2లోకి రావడంతో ప్రగ్యా జైస్వాల్‌ను ఈ సినిమా నుంచి తీసేశారా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి.
అఖండలో ఆమే కథానాయిక అన్న సంగతి తెలిసిందే. సీక్వెల్లో ఆమె పాత్ర కూడా ఉంటుందనే అనుకున్నారు. కానీ సంయుక్త రాకతో ప్రగ్యాపై వేటు పడిందేమో అనుకున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే.. ఈ సినిమాలో ప్రగ్యా కొనసాగనుంది. కొత్తగా సంయుక్త వచ్చి చేరింది. బాలయ్య సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు ఉండడం చాలా కామన్ అన్న సంగతి తెలిసిందే. అఖండలో మాత్రం అలా లేదు. కానీ సీక్వెల్లో మాత్రం రెండో హీరోయిన్ వచ్చి చేరింది.
బాలయ్యతో సంయుక్త నటించనుండడం ఇదే తొలిసారి. మరి అలాంటి యంగ్ హీరోయిన్‌కు బాలయ్య సినిమాలో ఎలాంటి రోల్ ఉంటుందో చూడాలి. మరోవైపు ప్రగ్యా బాలయ్యతో వరుసగా సినిమాలు చేస్తోంది. ఆమె ఇప్పటికే అఖండ, డాకు మహారాజ్ సినిమాల్లో బాలయ్యతో జోడీ కట్టింది. అఖండ-2 వీరి కలయికలో మూడో సినిమా. ఈ ఏడాది దసరాకు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on January 24, 2025 8:55 pm
ఆమంచి కృష్ణమోహన్. చీరాల మాజీ ఎమ్మెల్యే.. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కానీ, ఆయన పరిస్థితి డోలాయమానంలో ఉంది.…
హెల్దిగా ఉండడం కోసం మనం తీసుకునే ఆరోగ్యకరమైన డైట్ లో సూపర్ఫుడ్స్ను భాగం చేసుకోవడం చాలా అవసరం. అలాంటి ఆహారాలలో…
వైసీపీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటులో ఆ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి శుక్రవారం సాయంత్రం సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి…
అసలే థియేటర్ కు ఓటిటి మధ్య గ్యాప్ తగ్గిపోవడం పట్ల ఒకపక్క డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన వ్యక్తం చేయడం చూస్తూనే ఉన్నాం.…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో అధికారం కోల్పోయిన విషయం తెలిసిందే. కేవలం 11…
ఏపీ సర్కారు తరఫున సీఎం చంద్రబాబు, మంత్రి నారాలోకేష్లు దావోస్లో పెట్టుబడులు దూసుకు వచ్చే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో…