గత ఏడాది డిసెంబరు మొదటి వారంలో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పుష్ప: ది రూల్’ దేశవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను ఎలా రూల్ చేసిందో తెలిసిందే. రిలీజై 50 రోజులు కావస్తున్నా ఇప్పటికీ ఈ సినిమా థియేట్రికల్ రన్ కొనసాగుతోంది. హిందీలో ఇంకా ఆ సినిమా చెప్పుకోదగ్గ షేర్ రాబడుతూనే ఉంది. గత వారం రీలోడెడ్ వెర్షన్ పేరుతో 20 నిమిషాల అదనపు సన్నివేశాలు కలపడంతో మళ్లీ కొంత మేర ఆక్యుపెన్సీలు పెరిగాయి.
ఐతే థియేటర్లలో చూసే వాళ్లు చూస్తూనే ఉండగా.. బుల్లితెరపైకి ఈ సినిమా ఎఫ్పుడు వస్తుందా అని చాలామంది ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. వారి నిరీక్షణకు నెలాఖరులో తెర పడవచ్చని భావిస్తున్నారు. హిందీలో మల్టీప్లెక్సులు పెట్టిన షరతు ప్రకారం రిలీజైన 8 వారాల్లోపు ఓటీటీలో రిలీజ్ చేయకూడదు. ఆ ప్రకారమే ఓటీటీ డీల్ జరిగింది ‘పుష్ప-2’ చిత్రానికి ఇంకో వారం రోజుల్లో ఆ గడువు ముగుస్తుంది. మరి వెంటనే సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుందా అన్నది ఆసక్తికరం.
‘పుష్ప-2’ డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకుంది. డిజిటల్ వెర్షన్ కోసం ‘పుష్ప-2’ కొన్ని వారాల నుంచి పని చేస్తోంది. ఇటీవల రిలీజ్ చేసిన అదనపు 20 నిమిషాలు ఓటీటీ వెర్షన్ కోసం రెడీ చేసినవే. ఆ తర్వాత కూడా కొంచెం బెటర్‌మెంట్ చేసే ప్రయత్నం జరుగుతోంది. నెట్ ఫ్లిక్స్ వాళ్లతో జనవరి 30 నుంచి ఏ రోజైనా సినిమాను స్ట్రీమ్ చేసుకునేలా ఒప్పందం చేసుకున్నారు నిర్మాతలు.
వచ్చే వారం రోజుల్లో థియేటర్లలో ఆక్యుపెన్సీలను చూసి.. ఓటీటీ వెర్షన్ రిలీజ్ డేట్ నిర్ణయించవచ్చు. నిర్ణయం నెట్ ఫ్లిక్స్ వాళ్ల చేతుల్లోనే ఉంది. ప్రస్తుత సమాచారం ప్రకారం జనవరి 31న సినిమాను స్ట్రీమ్ చేసే అవకాశాలున్నాయి. త్వరలోనే ఈ విషయమై ప్రకటన వస్తుందని భావిస్తున్నారు. ఓటీటీ వెర్షన్లో మరికొన్ని నిమిషాల కంటెంట్ యాడ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయట. అలా అయితే ప్రస్తుతం థియేటర్లలో ఉన్న పుష్ప-2 రీలోడెడ్ వెర్షన్ కంటే ఫైనల్ వెర్షన్ మరింత మజా అందిస్తుందన్నమాట.
This post was last modified on January 24, 2025 7:44 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…