Movie News

రెహమాన్ వదిలిపెట్టే సమస్యే లేదు!!

సోషల్ మీడియాలో ఏదైనా పుకారు మొదలైందంటే క్షణాల్లో ఊరువాడా దాటేసి ప్రపంచం మొత్తానికి చేరిపోతోంది. అది నిజమో కాదో అర్థం చేసుకునేలోపే డ్యామేజవుతున్న సందర్భాలు బోలెడు. తాజాగా రామ్ చరణ్ 16 నుంచి సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తప్పుకున్నారనే వార్త మెగా ఫ్యాన్స్ లో ఖంగారు పుట్టించింది.

షూటింగ్ గాడిలో పడుతున్న టైంలో ఇలాంటి షాక్ ఏంటని టెన్షన్ పడ్డారు. కానీ అలాంటిదేమీ లేదని యూనిట్ మాట. రెహమాన్ స్థానంలో దేవిశ్రీ ప్రసాద్ వస్తున్నాడనేది ఎవరో కావాలని పుట్టించారని, మూడు పాటలు రెహమాన్ రికార్డింగ్ చేశాక నిర్ణయం మార్చుకునే సమస్యే ఉండదని చెబుతున్నారు.

ఇందులో లాజిక్ ఉంది. రెహమాన్ పని మొదలుపెట్టాక అర్ధాంతరంగా వదిలేసిన ప్రాజెక్టులు చాలా అరుదు. ఇటీవలే సూర్య 45 నుంచి తప్పుకున్నది నిజమే. కానీ దానికసలు మ్యూజిక్ సిట్టింగ్స్ జరగలేదు. వ్యక్తిగత కారణాల వల్ల దానికి టైం కేటాయించలేనని భావించి డ్రాప్ అయ్యాడు. కానీ ఆర్సి 16కి ఆ సమస్య లేదు.

గత ఏడాది మూడు సాంగ్స్ అయిపోయాయి. వాటి చిత్రీకరణ కూడా త్వరలోనే జరగనుంది. సగం ఆల్బమ్ తన పేరు, మిగిలిన సగం ఇంకొకరికి షేర్ చేసే ఉద్దేశం రెహమాన్ కు ఎప్పుడూ ఉండదు. అందులోనూ దర్శకుడు బుచ్చిబాబు చెప్పిన కథ విపరీతంగా నచ్చేసింది కాబట్టి వద్దనే ఛాన్స్ ఉండదు.

అసలే గేమ్ ఛేంజర్ ఫలితం నుంచి మెల్లగా కోలుకుంటున్న అభిమానుల ఆశలన్నీ ఆర్సి 16 మీదే ఉన్నాయి. స్టోరీ లీక్స్, బయట పలు సందర్భాల్లో బుచ్చిబాబు ఇచ్చిన ఎలివేషన్స్, పెద్ద క్యాస్టింగ్ అంచనాలను ఎక్కడికో తీసుకెళ్తున్నాయి. వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ ఏడాది దసరాకే రిలీజ్ చేసే సాధ్యాసాధ్యాలను టీమ్ పరిశీలనలో పెట్టింది.

జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ విలేజ్ డ్రామాకు పెద్ది అనే వర్కింగ్ టైటిల్ పెట్టుకున్నారు. ఇదే ఫైనల్ అయినా ఆశ్చర్యం లేదు. శివరాజ్ కుమార్, జగపతిబాబు లాంటి భారీ తారాగణం ఆర్సి 16లో భాగం పంచుకుంటున్నారు. రంగస్థలం తరహా నేపథ్యం ఉంటుందట.

This post was last modified on January 24, 2025 2:32 pm

Share

Recent Posts

గాంధీ జయంతి ఇంత రష్ ఉందేంటి

అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…

1 hour ago

80′ s ట్రెండ్… చంద్రబాబు రూటే సెపరేటు

సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్‌’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…

2 hours ago

AI కోసం లక్షల కోట్లు… లాభాలు రాకపోతే ఏం జరుగుతుంది?

చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…

4 hours ago

జగన్ లోనూ ఓ కాక్రోచ్

నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…

4 hours ago

వృషకర్మ… తెలివైన పని చేసిందమ్మ

ఫౌజీ విడుదల వాయిదా గురించి అసలైన మైత్రి మూవీ మేకర్స్ ఇంకా చెప్పలేదు కానీ మిగిలిన సినిమాలు అలెర్ట్ అయిపోయి…

4 hours ago

యూపీఐ లో కొత్త షార్ట్‌కట్… స్కాన్ లేకుండానే పేమెంట్

షాప్‌లో యూపీఐ పేమెంట్ చేయాలంటే ప్రస్తుతం ఫోన్‌లో యాప్ ఓపెన్ చేసి, కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం. ఇక…

6 hours ago