సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ… తన పేరు ముందు ఉన్న బిరుదు మాదిరిగా ప్రతి విషయాన్ని సెన్సేషనల్ గానే చేసుకుంటూ వెళుతుంటారు. క్రైం జానర్ సినిమాలను తెరకెక్కించడంలో ఒకప్పుడు తనను మించిన వారు లేరని అనిపించుకున్న వర్మ… ఆ తర్వాత ఎందుకనో గానీ చతికలిబడిపోయారు. థర్డ్ గ్రేడ్ సినిమాల తరహా మూవీలు తెరకెక్కిస్తూ తనను తాను తగ్గించుకుంటున్నారు. ఇక నిత్యం వివాదాలతోనే ఆయన సావాసం చేస్తున్న వైనం కూడా ఆసక్తి రేకెత్తించేదే.
పోలీసులు అన్నా…చట్టాలు అన్నా…చివరకు కోర్టులు అన్నా లైట్ తీసుకుంటున్నట్లు కనిపించే వర్మకు ఇప్పుడు షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో ఆయనకు ఏకంగా 3 నెలల జైలు శిక్ష పడింది. అది కూడా మహారాష్ట్ర రాజదాని ముంబైలోని అంధేరీ కోర్టు ఆయనకు ఈ శిక్షను ఖరారు చేసింది. 2018లో మహేశ్ చంద్ర అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు ఆధారంగా వర్మపై చెక్ బౌన్స్ కేసు నమోదు అయ్యింది. అయితే ఆ కేసులో ఏనాడూ వర్మ కోర్టుకు హాజరైన దాఖలానే లేదట.
కోర్టులను లైట్ తీసుకున్న వర్మ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంధేరీ కోర్టు… వర్మపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. అంతేకాకుండా విచారణకు హాజరు కాని వర్మకు 3 నెలల జైలు శిక్షను విధించింది. ఈ కేసులో 3 నెలల్లోగా ఫిర్యాదుదారుడికి రూ.3.72 లక్షల పరిహారం చెల్లించాలని వర్మకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ పరిహారం చెల్లించని పక్షంలో మరో 3 నెలల పాటు జైలు జీవితం గడపాలంటూ తీర్పు చెప్పింది. ఈ తీర్పుతో వర్మ ఉరుకులు పరుగులు పెట్టక తప్పదు. మునుపటి మాదిరిగా ఇప్పుడూ లైట్ తీసుకుంటే మాత్రం ఆయన తప్పనిసరిగా జైలు శిక్ష అనుభవించక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on January 23, 2025 2:51 pm
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…