Movie News

వివాదాలు ఓకే….అసలు విషయం వీకే

తీవ్ర వివాదాలు ఎదురుకుంటూ విపరీతమైన వాయిదాలకు లోనవుతూ వచ్చిన ఎమర్జెన్సీ ఇటీవలే విడుదలయ్యింది. క్రిష్ వదిలేశాక మణికర్ణిక బ్యాలన్స్ పూర్తి చేసిన అనుభవం ఇచ్చిన నమ్మకమో ఏమో కానీ కంగనా రౌనత్ మరోసారి దర్శకురాలి అవతారం ఎత్తింది.

దశాబ్దాల క్రితం దేశాన్ని కుదిపేసిన ఎమర్జెన్సీ కాలం నాటి పరిస్థితులను నేపథ్యంగా తీసుకున్న కంగనా మాజీ ప్రధాని ఇందిరా గాంధీని వాస్తవిక కోణంలో చూపించలేదని కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చింది. అయితే ఎట్టకేలకు థియేటర్ మోక్షం దక్కించుకున్న ఈ హిస్టారికల్ డ్రామాలో వివాదాలు ఓకే కానీ విషయం మాత్రం వీకే అనిపించుకుంది.

ఇందిరా గాంధీ బాల్యం, నెహ్రు కుటుంబ పరిస్థితులు, ఆనాటి రాజకీయ వాతావరణం, సామజిక వైరుధ్యాలు ఇలా చాలా అంశాలు టచ్ చేసిన కంగనా రౌనత్ ఎమర్జెన్సీ నాటి దుర్భర స్థితిని కళ్ళకు కట్టినట్టు చూపించడంలో తడబాటుకు గురయ్యింది. ఇందిరా వారసుడు సంజయ్ గాంధి చేసిన తప్పులను ఎత్తి చూపించే క్రమంలో వాస్తవాలు కొన్ని పక్కదారి పట్టినట్టు అనిపించక మానదు.

ఎమర్జెన్సీ టైంలో దేశం ఎంత గడ్డు కాలం అనుభవించిందో చూపించడానికి బదులు నాణేనికి ఒక వైపే హైలైట్ చేసినట్టు కంగనా ఎంచుకున్న నెరేషన్ ఒక వర్గం మద్దతుదారులకు మాత్రమే కన్విన్సింగ్ గా అనిపిస్తుంది. మిగిలినవారికి కష్టమే.

కంగనాలోని దర్శకురాలు మరింత మెరుగుపడాల్సింది చాలా ఉంది. కాకపోతే గతంలో ఇంచుమించు ఇదే బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఇందూ సర్కార్ కంటే ఈ ఎమర్జెన్సీ కొంత బెటర్ అనిపిస్తుంది. ఆర్టిస్టులు పాత్రలకు జీవం పోశారు. ఇదంతా ఎలా ఉన్నా డీసెంట్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఎమర్జెన్సీ రిలీజయ్యాక కాంట్రావర్సిలు తీవ్రం చేస్తుందేమో అనుకుంటే అలా జరగకపోవడం కొంత రిలీఫ్.

1975 నుంచి 77 మధ్య జరిగిన కీలక విషయాలు ఇందులో చాలా ప్రస్తావించలేదు. అసలు ఎమర్జెన్సీకి దారి తీసిన సంఘటనలు పూర్తిగా చూపించకపోవడం లోపమే. నటిగా కంగనా మీద వేలెత్తి చూపించలేం కానీ దర్శకురాలిగా మెచ్చుకునే ఛాన్స్ ఇవ్వలేదు.

This post was last modified on January 22, 2025 5:59 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

సీతమ్మ వాకిట్లో.. నాగ్ వాకిట నుంచే

ఒక కథ ఒక చోటి నుంచి ఇంకో చోటికి ప్రయాణం చేయడం.. ఎవరికో అనుకున్న కథ ఇంకెవరికో సెట్ కావడం…

4 hours ago

బీజేపీలో పాత సామాన్లు: రాజా సింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఘోషా మ‌హ‌ల్ ఎమ్మెల్యే, వివాదాల‌కు కేంద్రంగా ఉన్న రాజా సింగ్ తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.…

8 hours ago

హీరో-డైరెక్టర్ ‘పాడు కాస్ట్’ అదిరిపోలా

కేవలం సినిమాలో వినోదం ఉంటే సరిపోదని.. ప్రమోషన్లను కూడా సినిమా థీమ్‌కు తగ్గట్లు సరదాగా డిజైన్ చేసి ప్రేక్షకుల దృష్టిని…

9 hours ago

దేశవ్యాప్తంగా 5G.. ఏ రేంజ్ లో ఉందంటే..

భారతదేశంలో 5G సేవలు చాలా వేగంగా విస్తరిస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 776 జిల్లాల్లో…

9 hours ago

నా సినిమా సేఫ్ అంటున్న దర్శకుడు

‘మిర్చి’ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ‘నా ఫ్యామిలీ సేఫ్’ అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ ఎంత పాపులరో కొత్తగా చెప్పాల్సిన…

10 hours ago

బాబుతో నాగం భేటీ… ఎన్నెన్ని తీపి గురుతులో?

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును గురువారం తెలంగాణకు చెందిన సీనియర్ మోస్ట్ రాజకీయ నేత, మాజీ మంత్రి…

10 hours ago