బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ చిత్రాలు తీస్తూ ఎక్కువ పారితోషకం పుచ్చుకుంటున్నా సరే.. సినిమా సినిమాకు మధ్య ఎక్కువ గ్యాప్ వచ్చేది. కానీ అక్షయ్ వాళ్లు ఒక సినిమా చేసే టైంలో మూణ్నాలుగు సినిమాలు చేస్తూ అందులో రెండైనా హిట్లు ఇచ్చేవాడు. తద్వారా అతడి సక్సెస్ రేట్, ఆదాయం ఖాన్ త్రయం కన్నా ఎక్కువగా ఉండేది. అలా ఒక దశలో హైయెస్ట్ పెయిడ్ ఇండియన్ స్టార్‌గానూ అతను రికార్డు సృష్టించాడు.
ఐతే గత కొన్నేళ్ల నుంచి అక్షయ్ నుంచి సినిమాల ఫ్రీక్వెన్సీ అయితే తగ్గడం లేదు కానీ.. సక్సెస్ రేట్ మాత్రం బాగా పడిపోయింది. చివరగా అతను ఎప్పుడు పెద్ద హిట్ కొట్టాడో అభిమానులకు కూడా గుర్తు లేదు. ముఖ్యంగా కొవిడ్ తర్వాత అక్షయ్ సినిమాలకు ఆడియన్స్ కనెక్ట్ కావడం లేదు. వరుసగా రెండంకెల సంఖ్యలో అతడికి ఫెయిల్యూర్లు వచ్చాయి. కొవిడ్ తర్వాత సినిమాల తీరు పూర్తిగా మారిపోయిందని.. ప్రేక్షకుల అభిరుచి కూడా మారిపోయిందని.. అందుకే థియేటర్లలో సక్సెస్ రేట్ పడిపోయిందని అక్షయ్ అభివర్ణించాడు.
కరోనా సమయంలో ప్రేక్షకులకు ఓటీటీలకు అలవాటు పడిపోయారని.. ఏదైనా సినిమా రిలీజైతే ఓటీటీలోకి వచ్చాక చూస్తాం అనే పరిస్థితి వచ్చేసిందని అక్షయ్ తెలిపాడు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే ఎలాంటి సినిమాలు తీయాలో తెలియని అయోమయం నెలకొందని.. వాళ్లు ఎక్కువగా ఎంటర్టైనర్లు, భారీతనం ఉన్న చిత్రాలనే ఇష్టపడుతున్నారని అతనన్నాడు.
తాను కూడా అలాంటి సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పాడు. ఇదిలా ఉంటే అక్షయ్ నటించిన ‘భూల్ భులయియా’ సూపర్ హిట్ అయినప్పటికీ.. ఆ తర్వాత వచ్చిన రెండు సీక్వెల్స్‌లో అతను నటించని సంగతి తెలిసిందే. సీక్వెల్స్ రెండింట్లో కార్తీక్ ఆర్యన్ హీరోగా చేశాడు. అవి ఇంకా పెద్ద సక్సెస్ అయ్యాయి. మరి సీక్వెల్స్‌లో మీరెందుకు నటించలేదు అని అక్షయ్‌ని అడిగితే.. వాటిలో తాను నటించకపోవడం అంటూ ఏమీ లేదని.. ఆ చిత్రాల నుంచి తనను తప్పించారని అక్షయ్ వ్యాఖ్యానించడడం విశేషం.
This post was last modified on January 22, 2025 5:54 pm
వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…
వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…
కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…