కరోనా తర్వాత థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిన మాట వాస్తవం. కొవిడ్ టైంలో ఓటీటీలకు బాగా అలవాటు పడ్డాక.. థియేటర్లకు వెళ్లి అంతంత ఖర్చు పెట్టడం ఎందుకు, కొన్ని రోజులు ఆగి అయినా ఇంట్లో ప్రశాంతంగా సినిమా చూసుకుందాంలే అనుకునే వారు ఎక్కువయ్యారు. ఇలాంటి టైంలో ఫ్యామిలీస్‌ను థియేటర్లకు రప్పించడం సవాలుగా మారింది. వారికి నచ్చే సినిమా అందించడం ఒకెత్తయితే.. థియేటర్లకు రావడానికి అనువైన వాతావరణం కల్పించడం మరో ఎత్తు.
కానీ వాళ్లను ఎలా ఆకర్షించాలో చూడకుండా ప్రభుత్వాలు అనుమతులు ఇస్తున్నాయి కదా అని తొలి వారం, పది రోజుల్లో అయిన కాడికి టికెట్ల ధరలు పెంచేసి ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు దూరం చేస్తున్న పరిస్థితులు తలెత్తాయి. మిగతా వర్గాల ప్రేక్షకులు సైతం టికెట్ల ధరల విషయంలో వెనుకంజ వేయడం కొన్ని సినిమాల విషయంలో జరిగింది. ‘పుష్ప-2’ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఆక్యుపెన్సీలు ఆశించిన స్థాయిలో లేకపోవడానికి కచ్చితంగా అధిక టికెట్ల ధరలు ఒక కారణం అనడంలో సందేహం లేదు.
సంక్రాంతి సినిమాల్లో మొదటగా రిలీజైన ‘గేమ్ చేంజర్’కు కూడా ఎక్కువ రేట్లే పెట్టారు. అసలే టాక్ బాగా లేదు. పైగా రేట్లు ఎక్కువ. దీంతో ఈ సినిమా థియేటర్లలో కూడా జనం పలుచబడిపోయారు. కానీ సంక్రాంతి రేసులో వచ్చిన మిగతా రెండు చిత్రాలు ‘డాకు మహారాజ్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలు మాత్రం అంచనాలను మించి ఆడేస్తున్నాయి. ముఖ్యంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ వసూళ్ల మోత గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఆ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నార్మల్ రేట్లతోనే రిలీజ్ చేశారు. ‘డాకు మహారాజ్’కు ఏపీలో రేట్లు కొంత పెంచారు. అసలే ఫ్యామిలీ ఎమోషన్ లతో కూడిన మాస్, మూవీ, పైగా అధిక ధరలు లేవు. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు పోటెత్తుతున్నారు. టికెట్ల ధరలు అందుబాటులో ఉండి, వాళ్లు కోరుకునే సినిమా వస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదు. గత నెల పుష్ప-2 చూడాలని ఉన్నా, అధిక రేట్లకు భయపడి థియేటర్లకు వెళ్లడం మానేసిన ఫ్యామిలీ ఆడియన్స్ సంఖ్య పెద్దదే.
యూత్ ఆడియన్స్‌కు సైతం ఈ సినిమా రేట్లు షాక్ కొట్టేలా చేశాయి. నార్మల్ రేట్లు ఉంటే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరిగి ఓవరాల్ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందన్న బేసిక్ సూత్రాన్ని నిర్మాతలు మరిచిపోతున్నారు. పుష్ప-2కు ఎక్కువ రేట్లు ఉన్నా.. అంతకంటే తక్కువ ధరలో రిలీజైన కల్కి మూవీ ఒక థియేటర్లో కలెక్ట్ చేసిన మొత్తం దాదాపు 50 శాతం ఎక్కువ అంటూ ఒక ఎగ్జిబిటర్ గత నెల విలేకరులతో చెప్పిన మాట ఇక్కడ ప్రస్తావనార్హం.
కాబట్టి ప్రభుత్వాలు అనుమతులు ఇస్తున్నాయని అత్యాశతో అయిన కాడికి రేట్లు పెంచడం ద్వారా ప్రేక్షకులను థియేటర్లకు దూరం చేస్తున్నారనే వాస్తవాన్ని నిర్మాతలు గుర్తిస్తే మంచిది.
This post was last modified on January 22, 2025 5:47 pm
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…
బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…