ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీకి ఫౌజీ టైటిల్ ఖరారైనట్టే. సరైన టైం చూసి అఫీషియల్ గా అనౌన్స్ చేసేందుకు నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. సీతారామం బ్లాక్ బస్టర్ తర్వాత రాఘవపూడి దక్కించుకున్న బంపర్ ఆఫర్ ఇది.
ప్రభాస్ దీన్ని ఎంతగా ప్రేమించాడంటే ది రాజా సాబ్ కు ఆ మధ్య చిన్న బ్రేక్ ఇచ్చి మరీ ఫౌజీ కోసం షెడ్యూల్స్ కేటాయించేంత. విశాల్ చంద్రశేఖర్ ఇప్పటికే మూడు పాటలు అందించగా మిగిలినవి త్వరలోనే ఫైనల్ చేయబోతున్నారు. ఇక్కడి దాకా అందరికి తెలిసిన విషయాలే.
అసలు ఫౌజీ ప్రపంచం ఊహకందని స్థాయిలో ఉండబోతోందని సమాచారం. స్వాతంత్రం రాకముందు జరిగే నేపథ్యంలో ప్రభాస్ ఒక బ్రాహ్మణ కులం నుంచి వచ్చిన సైనికుడిగా కనిపిస్తాడని టాక్. తనకు హీరోయిన్ ఇమాన్వికి మధ్య జరిగే ప్రేమకథ చాలా ఫ్రెష్ గా ఇప్పటిదాకా ఏ స్టార్ హీరో సినిమాలో చూడనంత డెప్త్ గా ఉంటుందట.
అలాని హను స్టైల్ లో నెమ్మదిగా ఉండదు. కథనం పరుగులు పెడుతూనే గూస్ బంప్స్ అనిపించే యాక్షన్ ఎపిసోడ్స్ పుష్కలంగా పెట్టారట. ముఖ్యంగా బ్రిటిషర్లతో చేసే ఒక యుద్ధం చూసేందుకు రెండు కళ్ళు సరిపోవనే స్థాయిలో రానుందని ఇన్ సైడ్ న్యూస్.
ఇంకా బోలెడు విశేషాలు ఉంటాయి కానీ విడుదల దగ్గరపడే కొద్దీ ఒక్కొక్కటిగా బయటికి వస్తాయి. రిలీజ్ డేట్ విషయంలో మైత్రి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వేసవిలో రాజా సాబ్ వస్తే డిసెంబర్ లో ఫౌజీని దింపాలనేది ఒక ప్రతిపాదన. మైత్రినే నిర్మిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ నీల్ సినిమా 2026 సంక్రాంతి ఆల్రెడీ లాక్ అయ్యింది.
ఒకవేళ అది కనక అనుకున్న టైంకి పూర్తవ్వకపోతే అప్పుడు ఫౌజీని పండక్కి వదలొచ్చు. ఎప్పుడు వచ్చినా ఫౌజీ ఇచ్చే ఎక్స్ పీరియన్స్ మాత్రం నెవర్ బిఫోర్ అంటున్నారు. ముఖ్యంగా ఒకనాటి ఫ్రీడమ్ ఫైటర్స్ చాలా మంది ఇందులో కనిపించనున్నారట.
This post was last modified on January 22, 2025 5:30 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…