ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ చూశాంగా. ఏడాది పాటు ఆడించి నెలల తరబడి హౌస్ ఫుల్స్ చేశారు. అలాని అన్ని అలాగే హిట్ కొట్టిస్తారని గ్యారెంటీ లేదు. దానికి నిదర్శనమే కల్కి 2898 ఏడి. ఇటీవలే జనవరి 3న భారీ ఎత్తున జపాన్ థియేటర్లలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
అస్వస్థత వల్ల ప్రభాస్ వెళ్ళలేదు కానీ దర్శకుడు నాగ అశ్విన్ ప్రత్యేక అతిథిగా హాజరై ప్రమోషన్లు చేసుకున్నాడు. ఫాంటసీ ఫిక్షన్ కాబట్టి అక్కడి ప్రేక్షకులను మెప్పిస్తుందనే ధీమా టీమ్ లో ఉండేది. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే కల్కిని వాళ్ళు లైట్ తీసుకున్నారు.
ఓపెనింగ్ లో 8.5 మిలియన్ యెన్లు (మన కరెన్సీలో సుమారు 45 లక్షలు) సాధించిన కల్కి ఆ తర్వాత ఊపును కొనసాగించలేకపోయింది. మొదటి వారం తిరిగే లోపు కోటి నుంచి రెండు కోట్ల మధ్యలోనే ఆగిపోవడంతో థియేట్రికల్ రన్ ముగించాల్సి వచ్చిందని ట్రేడ్ టాక్. ఇలా జరగడానికి కారణం లేకపోలేదు.
కల్కిలో ఉన్న అశ్వద్ధామ, కర్ణుడు, శ్రీకృష్ణుడు పాత్రలు మైథలాజికల్ గా మనకు కనెక్ట్ అయినంతగా జపాన్ జనాలకు ఎక్కవు. అందులోనూ ఈ పాత్రల మధ్య సంబంధం అర్థమైతే తప్ప సినిమాని ఆస్వాదించలేరు. దీంతో సహజంగానే కల్కికి ఆశించిన స్థాయిలో స్పందన దక్కలేదని స్పష్టమవుతోంది.
ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల మార్కును దాటిన కల్కి 2898 ఏడి జపాన్ లో ఆడి ఉంటే రికార్డుల లెక్కలు మారేవి. జూన్ నుంచి కల్కి 2 మొదలుపెట్టే ప్లాన్ లో ఉన్నామని ఇటీవలే నిర్మాత అశ్వినిదత్ వెల్లడించిన సంగతి తెలిసిందే. బాహుబలి, కెజిఎఫ్ తరహాలో అసలు కథ సీక్వెల్ లోనే ఉండబోతోందనే లీకుతో ఇప్పటికే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.
ఫస్ట్ పార్ట్ లో పరిమితంగా కనిపించిన కమల్ హాసన్ ఈసారి పూర్తి స్థాయి విలన్ గా విశ్వరూపం చూపించబోతున్నారు. కర్ణుడిగా ప్రభాస్ రివీలయ్యాడు కాబట్టి కల్కిగా మరో స్టార్ రావొచ్చనే టాక్ కూడా ఉంది. విడుదల మాత్రం 2027 కన్నా ముందు జరిగే సూచనలు తక్కువగానే ఉన్నాయి.
This post was last modified on January 22, 2025 10:36 am
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…