టాలీవుడ్ నిర్మాతల ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ రైడ్స్ జరగడం కొత్తేమీ కాదు. ఒక నిర్మాణ సంస్థకు పెద్ద సక్సెస్ వచ్చినపుడు ఆదాయపు పన్ను శాఖ అధికారులు రైడ్స్ చేయడం చాలాసార్లు జరిగింది. ఐతే ఇప్పుడు ఒకేసారి రెండు ప్రముఖ నిర్మాణ సంస్థల అధినేతల ఇళ్లు, ఆఫీసులపై దాడులు జరగడం.. ఫైనాన్షియర్ల మీద సైతం ఐటీ అధికారులు కన్నేయడం చర్చనీయాంశంగా మారింది.
గత నెల ‘పుష్ప-2’తో భారీ విజయం అందుకున్న మైత్రీ మేకర్స్ అధినేతలు.. ఇప్పుడు సంక్రాంతికి ‘గేమ్ చేంజర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలను రిలీజ్ చేసిన దిల్ రాజు ఐటీ అధికారులకు టార్గెట్ అయ్యారు. ఈ ఐటీ రైడ్స్ సాధారణమే అని ఆయా సంస్థల వర్గాలు చెబుతున్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. ఈ సంస్థలు తమ సినిమాలకు సంబంధించి రిలీజ్ చేసిన కలెక్షన్ల పోస్టర్ల వల్లే ఈ చిక్కులు వచ్చాయంటూ చర్చించుకుంటున్నారు.
‘పుష్ప-2’ సినిమాకు సంబంధించి మొదట్నుంచి భారీ వసూళ్ల గురించి పేర్కొంటూ వరుసగా కలెక్షన్ల పోస్టర్లు దించారు. మూడు రోజులకే 500 కోట్లు.. వారానికే వెయ్యి కోట్లు.. ఇలా కలెక్షన్ల పోస్టర్లు వస్తూనే ఉన్నాయి. చివరికి ‘బాహుబలి-2’ వసూళ్లను కూడా దాటేసి ఆల్ టైం హైయెస్ట్ ఇండియన్ గ్రాసర్ రికార్డును ‘పుష్ప-2’ సొంతం చేసుకున్నట్లు ప్రకటించుకున్నారు మైత్రీ అధినేతలు.
మరోవైపు ‘గేమ్ చేంజర్’కు సంబంధించి తొలి రోజు రిలీజ్ చేసిన రూ.186 కోట్ల పోస్టర్ చర్చనీయాంశంగా మారింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ భారీ కలెక్షన్ల గురించి కూడా రోజూ పోస్టర్లు వస్తూనే ఉన్నాయి. వీటిలో ‘పుష్ప-2’, ‘గేమ్ చేంజర్’ పోస్టర్లు ఫేక్ అంటూ చాలా చర్చ జరిగింది సోషల్ మీడియాలో. కలెక్షన్లు మరీ పెంచి చూపించారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఇప్పుడు ఆ పోస్టర్ల వల్లే ఐటీ రైడ్స్ కూడా జరుగుతున్నాయని.. ఫ్యాన్స్‌ను సంతృప్తిపరచడం కోసం చేసే ఈ పనులు ఐటీ తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయని నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. అలాంటిది ఏమి లేదని, సాధారణ రైడ్స్ వంటివే అని నిర్మాణ సంస్థలు తెలియజేశాయి.
This post was last modified on January 21, 2025 7:04 pm
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…