సీనియర్ స్టార్ హీరోలలో వందా రెండు వందల కోట్ల క్లబ్బులో చిరంజీవి, బాలకృష్ణతో పాటు వెంకటేష్ చేరిపోయారు. ఇక నాగార్జున ఒకటే బ్యాలన్స్. అదెప్పుడు జరుగుతుందాని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. గత కొన్నేళ్లలో నాగ్ కు పడిన బలమైన హిట్లు రెండే. సోగ్గాడే చిన్ని నాయనా బ్లాక్ బస్టర్ కిందకే వస్తుంది కానీ మరీ ఇండస్ట్రీ రికార్డులు దుమ్ము దులిపేంత కాదు.
బంగార్రాజు విజయం సాధించినా సోగ్గాడేని దాటలేకపోయింది. వీటికి ముందు వెనుక వచ్చిన ది ఘోస్ట్, ఆఫీసర్, వైల్డ్ డాగ్ లాంటివన్నీ యావరేజ్ కూడా అనిపించుకోలేక చతికిలపడ్డాయి. భవిష్యత్తులో ఫ్యాన్స్ కొంత సంతోషం కొంత నిరాశ కలిగించే పాయింట్లున్నాయి.
నాగ్ ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాలకు వంద కోట్లు లేదా అంతకు మించి సాధించే ఛాన్స్ ఉంది. కానీ కుబేరలో మెయిన్ హీరో ధనుష్ కాబట్టి అది సోలోగా నాగార్జున అకౌంట్ లోకి రాదు. పాత్ర పరంగా ప్రాధాన్యం ఉన్నప్పటికీ దాన్ని ఎక్స్ టెండెడ్ క్యామియోగానే చూస్తారు.
శేఖర్ కమ్ముల ఆయన్ని ఎలా ప్రెజెంట్ చేస్తాడనే ఆసక్తి మూవీ లవర్స్ లో చాలా ఉంది. ఇక కూలి పక్కా రజనీకాంత్ సినిమా. నాగ్ కి ఎన్ని ఎలివేషన్లు, ఫైట్లు పెట్టినా సూపర్ స్టార్ మూవీగానే పరిగణిస్తారు. పైగా ఉపేంద్ర, అమీర్ ఖాన్ లాంటి బడా స్టార్లు భాగమయ్యారు. సో వెయ్యి కోట్లు సాధించినా కూలీ నాగార్జున అకౌంట్ లోకి రాదు.
సో వీలైనంత త్వరగా సోలో హీరోగా నాగార్జున ఒక మంచి మాస్ ఎంటర్ టైనర్ చేయాలనేది సినీ ప్రియుల కోరిక. కెరీర్ ప్రారంభంలో శివ తర్వాత ఎక్కువ స్టైలిష్ సినిమాలు చేసిన నాగ్ ఆశించిన ఫలితాలు అందుకోలేదు. రూటు మార్చి మాస్ బాట పట్టి వరసగా వారసుడు, అల్లరి అల్లుడు, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, హలో బ్రదర్ లతో అదిరిపోయే హిట్లు అందుకున్నారు.
నిన్నే పెళ్లాడతాతో ఫ్యామిలీ జానర్ లోనూ రికార్డులు రాశారు. సో ఇప్పుడు అలాంటి నాగార్జున కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఆ మధ్య వందో మూవీగా ఒక తమిళ దర్శకుడితో భారీ చిత్రం ప్లాన్ చేశారు కానీ అది లీక్ దశ దగ్గరే ఆగిపోయింది. సో ఎదురు చూపులు తప్పవు.
This post was last modified on January 21, 2025 6:40 pm
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…