2009లో విడుదలైన ‘అవతార్’ సినిమా అప్పట్లో ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. అప్పటిదాకా ఉన్న ప్రపంచ సినిమా రికార్డులన్నింటినీ ఆ చిత్రం బద్దలు కొట్టేసింది. ఒక సినిమాకు ఈ స్థాయిలో ఆదరణ దక్కుతుందో.. ఇంతమందిని థియేటర్లకు రప్పించే సత్తా సినిమాకు ఉందా అనిపించేలా బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేసిందా చిత్రం. ఈ చిత్రం సాధించిన సంచలన విజయం చూసి దర్శక నిర్మాత జేమ్స్ కామెరూన్.. దానికి మూడు సీక్వెల్స్ అనౌన్స్ చేశాడు.
వాటి రిలీజ్ డేట్లు కూడా ప్రకటించారు. ఐతే 2022లో వచ్చిన ‘అవతార్’ తొలి సీక్వెల్ ‘ది వే ఆఫ్ వాటర్’ అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమా విషయంలో మిశ్రమ స్పందన కనిపించింది. విజువల్‌గా ఫస్ట్ పార్ట్ అంత గొప్పగా లేదని.. ‘అవతార్’లో చూసిన విజువల్సే రిపీటయ్యాయని.. సినిమా బోరింగ్ అని ఫీడ్ బ్యాక్ వచ్చింది. అయినా సరే.. రిలీజ్ ముంగిట ఉన్న హైప్ వల్ల ఈ చిత్రం కూడా భారీ వసూళ్లే రాబట్టింది.
ఐతే సినిమాకు వచ్చిన ఫీడ్ బ్యాక్ మాత్రం కామెరూన్‌కు చేరినట్లే ఉంది. ‘అవతార్-2’ ఫలితం గురించి మాట్లాడకుండానే.. ఆ సినిమా కంటే ‘అవతార్-3’ మెరుగ్గా ఉంటుందని, కచ్చితంగా ప్రేక్షకులను సంతృప్తి పరిచేలా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ‘‘ప్రేక్షకుల అంచనాలకు మించే ఈ చిత్రం ఉంటుంది. తెరపై ఈ విజువల్ వండర్‌ను చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. అవతార్ సిరీస్‌లో గత రెండు చిత్రాల్లో చూసిన వాటిని ఎక్కడా పునరావృతం కాకుండా చూసుకున్నాం.
వాటి స్థానంలో సరికొత్త ఛాయిస్‌లతో మీ ముందుకు వస్తాను. ఇలా ధైర్యం చేసి కొన్ని సృష్టించకపోతే ప్రేక్షకుల సమయాన్ని, డబ్బును వృథా చేసిన వాడిని అవుతాను. రెండు భాగాల్లో లేని అద్భుతాలను మూడో పార్ట్‌లో చూస్తారు. మీ అంచనాలను మించిన లైవ్ యాక్షన్ ఇందులో ఉంటుంది. మరో కొత్త ప్రపంచానికి సంబంధించి భిన్నమైన కథనం, విభిన్నమైన పాత్రలు ఇందులో కనిపిస్తాయి. ఈసారి పాత్రల మీద ఎక్కువ దృష్టిపెడుతున్నాం’’ అని కామెరూన్ తెలిపాడు. ఫైర్ థీమ్‌తో రాబోతున్న ‘అవతార్-3’ ఈ ఏడాది డిసెంబరు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on January 21, 2025 5:29 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…