ముంబయిలో ప్రముఖ సినీ నటుడు అమితాబ్ బచ్చన్ తన డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను భారీ లాభంతో విక్రయించారు. ఓషివారాలోని క్రిస్టల్ గ్రూప్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ‘ది అట్లాంటిస్’ లో ఈ అపార్ట్‌మెంట్‌ను బిగ్ బీ 2021 ఏప్రిల్‌లో రూ. 31 కోట్లకు కొనుగోలు చేశారు. తాజాగా అదే ప్రాపర్టీని అమితాబ్ రూ. 83 కోట్లకు విక్రయించడం విశేషం. ఈ లావాదేవీ ద్వారా ఆయనకు 168 శాతం లాభం దక్కింది.
ఈ అపార్ట్‌మెంట్ దాదాపు 5,704 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండగా, 4, 5, 6 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్‌లతో విశాలమైన ప్రాజెక్ట్‌లో భాగమైంది. ఐజీఆర్ రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం ఈ లావాదేవీ 2024 ప్రారంభంలో అధికారికంగా నమోదు అయ్యింది. అంతకుముందు ఈ అపార్ట్‌మెంట్‌ను అమితాబ్ బాలీవుడ్ నటి కృతి సనన్‌కు అద్దెకు ఇచ్చారు.
నెలవారీ అద్దె రూ. 10 లక్షలు కాగా, రూ. 60 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుని 2021 నవంబర్‌లో ఈ లావాదేవీ జరిగింది. అమితాబ్ బచ్చన్ మాత్రమే కాకుండా, ఆయన కుటుంబం కూడా రియల్ ఎస్టేట్ పెట్టుబడులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. 2023 లోనే వారు సుమారు రూ. 100 కోట్లకు పైగా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి చేశారు.
ప్రధానంగా ఓషివారా, మగథానే (బోరివాలి ఈస్ట్) ప్రాంతాల్లో నివాస, వాణిజ్య ప్రాపర్టీల కొనుగోలుకు ప్రాధాన్యత ఇచ్చారు. 2020 నుంచి ఇప్పటివరకు బచ్చన్ కుటుంబం రియల్ ఎస్టేట్‌లో దాదాపు రూ. 200 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. ఈ ప్రతిష్ఠాత్మక లావాదేవీలతో అమితాబ్ బచ్చన్ కేవలం వెండితెరపై కాకుండా పెట్టుబడుల లోకంలో కూడా తన సత్తా చాటుతున్నారు.
This post was last modified on January 21, 2025 12:49 pm
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…