టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు టార్గెట్ గా మంగళవారం తెల్లవారుజామున ఆదాయపన్ను శాఖ సోదాలు మొదలయ్యాయి. బడా నిర్మాతగానే కాకుండా తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైైర్మన్ గా వ్యవహరిస్తున్న రాజుపై ఆదాయపన్ను శాఖ దాడులు చేస్తోందన్న వార్తలు అటు సినీ ఇండస్ట్రీతో పాటు ఇటు పొలిటికల్ సర్కిళ్లలోనూ హాట్ టాపిక్ గా మారింది. దిల్ రాజు ఇళ్లతో పాటు ఆయనకు చెందిన కార్యాలయాలపైనా ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు మొదలుపెట్టారు.
దిల్ రాజుతో పాటుగా శిరీష్, దిల్ రాజు కుమార్తె హన్షిత రెడ్డిల ఇళ్లు, కార్యాలయాలపైనా ఐటీ అధికారులు మూకుమ్మడిగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం పలు బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు హైైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో ఆకస్మిక దాడులను చేపట్టారు. ఫలితంగా నగరంలోని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో కలకలం రేగింది. మొత్తంగా నగరంలోని 8 ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి.
ఈ సంక్రాంతికి తెలుగులో ప్రధానంగా మూడు సినిమాలు రిలీజ్ కాగా… వాటిలో రెండు దిల్ రాజు నిర్మించినవే ఉన్నాయి. గ్లోబల్ స్టార్ రాంచరణ్ తేజ్ ప్రదాన పాత్రలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ వాటిలో భారీ బడ్జెట్ చిత్రం కాగా… విక్టరీ వెంకటేశ్ ప్రదాన పాత్రలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ రెండు సినిమాలను దిల్ రాజే నిర్మించారు. ఈ రెండు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకోగా… దిల్ రాజుకు భారీ ఎత్తున లాభాలు వచ్చినట్లుగా సమాచారం. అయితే ఈ లాభాలతో పాటుగా ఈ సినిమాల నిర్మాణం కోసం వినియోగించిన నిధులకు కూడా రాజు సరైన లెక్కలను చూపలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే ఈ లెక్కలు తేల్చేందుకే ఐటీ శాఖ రంగంలోకి దిగినట్లు సమాచారం.
This post was last modified on January 21, 2025 9:41 am
టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్.. ఓకప్పుడు తెలంగాణ మంత్రిగా ఉన్న బీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో…
ఒక హీరోయిన్ నటించిన రెండు సినిమాలు ఒకే టైంలో విడుదల కావడంలో ఆశ్చర్యం లేదు కానీ చాలా విషయాల్లో వాటి…
అమెరికా నూతన అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన డొనాల్డ్ ట్రంప్.. తన హయాంలో దేశానికి స్వర్ణ యుగం తీసుకువస్తానని ప్రకటిం చారు.…
కెజిఎఫ్ తర్వాత యష్ నటిస్తున్న టాక్సిక్ కి చెట్టు కష్టాలు ఎక్కువయ్యాయి. వినడానికి వింతగా ఉన్నా ఇది వాస్తవం. అదెలాగో…
ముఖ్యమంత్రిగా అనుభవంతో పాటు.. ప్రభుత్వాన్ని ఎప్పుడు ఎలా నడిపించాలన్న దాని గురించి ఎవరికైనా సలహాలు.. సూచనలు ఇవ్వొచ్చు కానీ నారా…
ఉత్సాహం మంచిదే కానీ సమయం.. సందర్భం చూసుకోవాలి. అదేమీ లేకుండా కూటమి సర్కారుకు ఉన్న సున్నిత అంశాల్ని పరిగణలోకి తీసుకోకుండా…