Movie News

విశాల్ – మీనన్ : భలే కాంబినేషన్

తమిళ స్టార్ హీరో విశాల్.. ఇటీవల వార్తల్లో వ్యక్తిగా మారిన సంగతి తెలిసిందే. ఎప్పుడో పుష్కర కాలం కిందట విడుదల కావాల్సిన తన చిత్రం ‘మదగజ రాజా’ ఆశ్చర్యకరంగా ఇన్నేళ్ల తర్వాత సంక్రాంతి కానుకగా విడుదలైంది. అంత పాత సినిమాను తమిళ ప్రేక్షకులు సూపర్ హిట్ చేసి ఆశ్చర్యపరిచారు. ఆ సినిమా రిలీజ్ ముంగిట ప్రమోషనల్ ఈవెంట్లో విశాల్ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నట్లు కనిపించడం చర్చనీయాంశం అయింది.

ఐతే కొన్ని రోజుల తర్వాత కోలుకుని మామూలు మనిషి కావడంతో అందరూ హమ్మయ్య అనుకున్నారు. కొంతమేర విశాల్ మీద సింపతీ కూడా ఈ సినిమాకు ప్లస్ అయిందనే చర్చ కూడా జరిగింది. మొత్తానికి ఎప్పటికీ విడుదలే కాదనుకున్న సినిమాతో ఇలా హిట్ కొట్టడంతో విశాల్ పేరు కోలీవుడ్లో మార్మోగుతోంది. ఇదే సమయంలో అతనొక క్రేజీ ప్రాజెక్టును అనౌన్స్ చేశాడు.

తమిళంలో విలక్షణ చిత్రాలతో గ్రేట్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్‌తో విశాల్ జట్టు కట్టబోతున్నాడు. గౌతమ్ స్టైలిష్ యాక్షన్ సినిమాలు తీయడంలో, అలాగే సున్నితమైన ప్రేమకథలు రూపొందించడంలో తన ప్రత్యేకతను చూపిస్తుంటాడు. విశాల్‌తో గౌతమ్ సినిమా అనగానే యాక్షన్‌ టచ్‌తోనే ఉంటుందని ఆశించవచ్చు.

కాక్క కాక్క, వేట్టయాడు విలయాడు, ఎన్నై అరిందాల్ చిత్రాలతో గౌతమ్ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. హాలీవుడ్ స్టాండర్డ్స్ కనిపిస్తాయి ఈ చిత్రాల్లో. విశాల్ ‘డిటెక్టివ్’ సినిమా సైతం గౌతమ్ తీసే యాక్షన్ చిత్రాల తరహాలోనే ఉంటుంది. వీళ్లిద్దరి కలయికలో అదిరిపోయే యాక్షన్ మూవీ వస్తుందని ఆశించవచ్చు. గౌతమ్ ఇప్పటికీ మంచి ఫాంలోనే ఉన్నప్పటికీ.. తన నిర్మాణ సంస్థ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడం వల్ల రెగ్యులర్‌గా సినిమాలు తీయలేకపోతున్నాడు.

‘ధృవ నక్షత్రం’ ఎంతకీ విడుదల కాక అతను ఇబ్బంది పడుతున్నాడు. అయినా కొంచెం వీలు చేసుకుని మమ్ముట్టితో ‘డొమినిక్’ అనే థ్రిల్లర్ తీశాడు. దీని తర్వాత విశాల్‌తోనే తన సినిమా ఉండబోతోంది. మరి ఈ క్రేజీ కాంబోలో ఎలాంటి సినిమా వస్తుందో చూడాలి.

This post was last modified on January 20, 2025 7:31 pm

Share

Recent Posts

జైలర్ 2 మీద పందెం కాసేదెవరు

అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. ఏపీ తెలంగాణ హక్కులు యాభై అయిదు కోట్లకు…

9 minutes ago

నిర్మాత రిస్క్ చేశాడు… జాక్‌పాట్ కొడుతున్నాడు

ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఇంత‌కుముందులా ఉదారంగా కొత్త సినిమాల‌ను కొన‌ట్లేద‌న్న సంగ‌తి తెలిసిందే. నిర్మాత‌లు అడుగుతున్న రేట్లకు, వాళ్లు ఆఫ‌ర్…

25 minutes ago

సుకుమార్ మీద దేవి ఫ్యాన్స్ ఎటాక్

కొంద‌రు ద‌ర్శ‌కులు టెక్నీషియ‌న్ల విష‌యంలో చాలా ప‌ర్టికుల‌ర్‌గా ఉంటారు. తమ‌తో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే…

4 hours ago

సైలెంటుగా వ‌చ్చి ఇండ‌స్ట్రీ హిట్ కొట్టేసింది

నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమ‌మ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన న‌టుడు. ఆ…

9 hours ago

ముఖ్యమంత్రి పదవికి దీప్కే రాజీనామా

అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…

13 hours ago

కొండా సురేఖకు కేబినెట్ హోదా?

తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…

14 hours ago