‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ మొదలుపెట్టిన ‘ది రియల్ మ్యాన్’ ఛాలెంజ్ సోషల్ మీడియాలో ఎంతగా పాపులరైందో తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, దర్శక ధీరుడు రాజమౌళి సహా ఎంతోమంది ప్రముఖులు ఈ ఛాలెంజ్‌ను స్వీకరించారు. ఇంటి పనుల్లో తమ నైపుణ్యాన్ని చూపించారు.
ఐతే టాలీవుడ్ ప్రముఖుల్లో ఒకరినొకరు బాగానే నామినేట్ చేసుకుంటూ వెళ్లారు కానీ.. అల్లు అర్జున్, ప్రభాస్‌లను ఎవరూ టచ్ చేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ప్రభాస్ అంటే ట్విట్టర్లో లేడు, మిగతా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్‌లోనూ అతనంత యాక్టివ్‌గా ఉండడు.
కానీ బన్నీ సంగతి అలా కాదు. ట్విట్టర్లో చాలా యాక్టివ్. ఇలాంటి ఛాలెంజ్‌లు విసిరితే బాగా రిసీవ్ చేసుకుంటాడన్న అభిప్రాయం జనాల్లో ఉంది. అయినా సరే.. స్టార్ హీరోలు, డైరెక్టర్లు అతణ్ని టచ్ చేయలేదు.
చాలా రోజుల తర్వాత చివరికి ‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డ బన్నీతో పాటు ప్రభాస్‌ను ఈ ఛాలెంజ్ దిశగా నామినేట్ చేశాడు. ఐతే ప్రభాస్ అనుకున్నట్లే ఈ ఛాలెంజ్‌కు స్పందించలేదు. కానీ బన్నీ కూడా స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఏ రాజమౌళో చిరంజీవో ఛాలెంజ్ చేసి ఉంటే బన్నీ తప్పక రెస్పాండయ్యేవాడేమో.
తనకు పెద్దగా పరిచయం లేని, ఫేమ్ లేని శోభు అనే సరికి లైట్ తీసుకున్నట్లున్నాడు. ఐతే ఇప్పుడు బన్నీకి ప్రియమైన మిత్రుడు, మంచి ఫేమ్ కూడా ఉన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్.. అతణ్ని నామినేట్ చేశాడు. సుక్కు నుంచి ఛాలెంజ్ తీసుకున్న దేవి.. బుధవారం ఓ చక్కటి వీడియోతో పలకరించాడు. తన మేనల్లుడు నిద్ర లేపి మరీ అలర్ట్ చేయడంతో సామగ్రి అంతా రెడీ చేసుకుని ఇంటి పనుల్లో పడ్డ దేవి.. చివర్లో ‘నాన్నకు ప్రేమతో’ పాట ప్లే అవుతుండగా తండ్రికి నివాళి అర్పించి ఈ వీడియోను ముగించాడు.
తర్వాత ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్ తీసుకోమని బన్నీతో పాటు మోహన్ లాల్ తదితరులను నామినేట్ చేశాడు. మరి ఇప్పుడైనా బన్నీ స్పందించి ఇంటి పనులు చేస్తున్న వీడియో పెడతాడేమో చూడాలి.
This post was last modified on April 29, 2020 2:50 pm
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…
ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…
ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…
టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…
పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…