Movie News

ప్రేమికుల రోజు ‘టాలీవుడ్’ టఫ్ ఫైట్

ఇప్పుడంతా టాలీవుడ్ లో సంక్రాంతి హడావిడి నడుస్తోంది. హిట్ టాక్ తో రెండు దూసుకుపోతున్నా బాక్సాఫీస్ డామినేషన్ మాత్రం పూర్తిగా వెంకటేష్ దే అయిపోయింది. ఇంకో వారం పది రోజులు వీటి ఫీడింగ్ తోనే థియేటర్లు గడిచిపోయేలా ఉన్నాయి. తిరిగి మళ్ళీ ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14న రసవత్తరమైన పోటీ నెలకొనబోతోంది. అంతకు ముందు వారమే తండేల్, పట్టుదల ఉన్నాయి కానీ వాటిలో ఒకటి వాయిదా పడొచ్చనే ప్రచారం బలంగా తిరుగుతోంది. ఇక వాలెంటైన్ డేకి క్లాష్ అవుతున్నవి మరీ పెద్ద రేంజ్ వి కాకపోయినా కంటెంట్ మీద ఆధారపడి ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నాయి. అవేంటో చూద్దాం.

విశ్వక్ సేన్ మొదటిసారి పూర్తి స్థాయి లేడీ గెటప్ వేసిన ‘లైలా’ మీద టీజర్ వచ్చాక మిశ్రమ స్పందనే కనిపిస్తోంది. కంటెంట్ ని సరిగా కనెక్ట్ చేయలేకపోయారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ట్రైలర్ తో వాటిని సరిచేస్తే మంచి బజ్ తీసుకురావచ్చు. ఊహించని విధంగా క తో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న కిరణ్ అబ్బవరం ఈసారి ‘దిల్ రుబా’తో పలకరిస్తున్నాడు. పైకి లవ్ స్టోరీలా కనిపిస్తోంది కానీ యాక్షన్ టచ్ కూడా ఉందని గ్లిమ్ప్స్ లో అర్థమైపోయింది. బ్రహ్మానందం, అబ్బాయి గౌతమ్ కలిసి తాత మనవడిగా నటించిన ‘బ్రహ్మ ఆనందం’ పూర్తిగా కామెడీని నమ్ముకుని దిగుతోంది. మేకర్స్ ఫలితం పట్ల ధీమాగా ఉన్నారు.

బలగంతో దర్శకుడిగా విజయం అందుకున్న కమెడియన్ వేణు యెల్దండి రూటుని అనుసరిస్తూ ధన్ రాజ్ డైరెక్ట్ చేసిన ‘రామం రాఘవం’ అదే రోజు రాబోతోంది. సముతిరఖనితో కలిసి స్క్రీన్ పంచుకున్న ధనరాజ్ చాలా ఎమోషనల్ స్టోరీ చేబుతాడట. ఈ నాలుగు సినిమాలు ఫిబ్రవరి 14న థియేటర్లలో ఉంటాయి. తండేల్ కోసం గ్యాప్ తీసుకోవాలనుకోవడం వల్ల క్లాష్ తప్పడం లేదు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే బాలీవుడ్ మూవీ ‘చావా’ అదే రోజు రానుంది. చారిత్రాత్మక నేపథ్యం, హీరోయిన్ రష్మిక మందన్న లాంటి అంశాల వల్ల ప్యాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు. మరి వీటిలో విజేతగా ఎవరు నిలుస్తారో ఇంకో నెలలో తేలనుంది.

This post was last modified on January 18, 2025 9:20 pm

Share

Recent Posts

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

1 minute ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

8 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

10 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

10 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

11 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

11 hours ago