సీనియర్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకి ఇటీవల స్టార్ హీరోల డేట్లు దొరకడం లేదు. మహేష్‍తో ప్లాన్ చేసిన వంశీ పైడిపల్లి సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే కాన్సిల్ అయిపోయింది. ప్రభాస్ డేట్స్ సాధించడం కోసం చేసిన ప్రయత్నం విఫలమయింది. రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇద్దరి డేట్లు దిల్ రాజుకి ఇప్పట్లో అందుబాటులో లేవు. దీంతో వయా దర్శకుల ద్వారా పెద్ద సినిమాలు సెట్ చేయాలని దిల్ రాజు ట్రై చేస్తున్నాడు.
కానీ అగ్ర దర్శకులు కూడా ఇప్పుడు వేరే ప్రాజెక్టులతో బిజీగా వున్నారు. దాంతో ప్రస్తుతం ఫెయిల్యూర్‍లో వుండి, త్వరలో హిట్ ఇవ్వగలరు అనే నమ్మకం వున్న దర్శకులను దిల్ రాజు లైన్లో పెడుతున్నాడు. ఉదాహరణకు బోయపాటి శ్రీను ఈమధ్య హిట్ ఇవ్వలేదు. కానీ అతని తదుపరి చిత్రం బాలకృష్ణతో కనుక అది ఖచ్చితంగా హిట్టవుతుందనే నమ్మకం మీద బోయపాటి శ్రీనుతో తదుపరి చిత్రాన్ని దిల్ రాజు ఖాయం చేసుకున్నాడు. ఆ సినిమా హిట్టయితే బోయపాటి శ్రీనుకి మళ్లీ డిమాండ్ పెరుగుతుంది కనుక, అతనితో పని చేద్దామనే హీరో వచ్చి తన బ్యానర్లో సినిమా చేస్తాడనేది దిల్ రాజు వ్యూహం.
ఇది తెలివైన పన్నాగమే కానీ ఎంతవరకు వర్కవుట్ అవుతుందనేది హీరో దొరికితేనే కానీ తెలీదు. దర్శకులకు, హీరోలకు అడ్వాన్సులిచ్చి బుక్ చేసి పెట్టుకోవడం నిర్మాతలు అందరూ చేసేదే కనుక ఒకవేళ ఈ ప్రాజెక్ట్ సెట్ అవ్వకపోయినా దిల్ రాజుకి పెద్ద నష్టమేం వుండదు.
This post was last modified on October 16, 2020 3:26 pm
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…