సూర్య సినిమా ‘కంగువా’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఆ అంచనాలను అందుకోవడంలో సినిమా ఘోరంగా విఫలమైంది. గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే అతి పెద్ద డిజాస్టర్లో ఒకటిగా కంగువా నిలిచింది. ఈ సినిమాతో సంగీత దర్శకుడిగా మరో మెట్టు ఎక్కుతాడనుకున్న దేవిశ్రీ ప్రసాద్ సైతం విమర్శలు ఎదుర్కొన్నాడు.
సినిమా చూసి బయటికి వచ్చిన వాళ్లంతా అందులోని శబ్ద కాలుష్యానికి తట్టుకోలేక తలలు పట్టుకున్నారు. సినిమాలో పాత్రలన్నీ అదే పనిగా అరుస్తూ ఉంటే.. నేపథ్య సంగీతం సైతం మరీ లౌడ్‌గా ఉండడం ప్రేక్షకులకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. దీంతో సౌండ్ ఎఫెక్ట్స్ గురించి రిలీజ్ టైంలో బాగా ట్రోలింగ్ జరిగింది. దీంతో ఈ సినిమాకు సౌండ్ ఇంజినీర్‌గా పని చేసిన ఆస్కార్ విన్నింగ్ టెక్నీషియన్ రసూల్ పొకుట్టి సైతం పరోక్షంగా బ్యాగ్రౌండ్ స్కోర్ మీద అసహనం వ్యక్తం చేశాడు.
ఈ శబ్ద కాలుష్యం వల్ల ఒకసారి చూడ్డానికే తలపోటు వస్తుండడంతో రిపీట్ ఆడియన్స్ ఎలా వస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ విమర్శలపై తాజాగా దేవిశ్రీ ప్రసాద్ స్పందించాడు. ఎవరి పేరూ ప్రస్తావించలేదు కానీ.. కంగువా సినిమాకు తన వర్క్ విషయంలో ఎక్కువగా ప్రశంసలే వచ్చాయని, విమర్శలు చేసిన వాళ్లు తక్కువ అని దేవి పేర్కొన్నాడు.
”నేను సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్‌ను పట్టించుకోను. నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. మనం ఏది చేసినా విమర్శించేవాళ్లు ఉంటారు. కంగువా ఆల్బం నాకు చాలా స్పెషల్. అందులో మన్నిప్పు పాటకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి. సూర్య ఫ్యాన్స్ ఆ పాటను ఎంతగానో సెలబ్రేట్ చేసుకున్నారు. సూర్య గారు కూడా నాకు ఫోన్ చేసి మ్యూజిక్ గురించి అరగంట మాట్లాడారు.
ప్రతి సినిమాలోనూ మంచి చెడులు ఉంటాయి. కంగువ సినిమా కోసం టీం ఎంత కష్టపడిందో దాని విజువల్స్ చూసినా, సూర్య నటనను పరిశీలించినా అర్థమవుతుంది. మేమందరం ఎంతో కష్టపడి, ఎంజాయ్ చేస్తూ పని చేసిన సినిమా అది. కొందరికి ఈ సినిమా నచ్చకపోయినా.. మేం మాత్రం కంగువా విషయంలో గర్వపడుతున్నాం” అని దేవిశ్రీ ప్రసాద్ స్పష్టం చేశాడు.
This post was last modified on January 17, 2025 6:20 pm
ఖుషి తర్వాత స్క్రీన్ పై కనిపించకుండా పోయిన సమంతా తిరిగి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. తన…
టాలీవుడ్ హీరోల్లో నానికి ఉన్న క్రెడిబిలిటీనే వేరు. ప్రతి హీరోకూ కెరీర్లో ఫ్లాపులు తప్పవు కానీ.. నాని కెరీర్ సక్సెస్…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు గురువారం బిజీబిజీగా గడిపారు. ఓ వైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, మరోవైపు…
ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కీలక మార్పును చేపట్టింది. జట్టును ముందుండి నడిపించిన రిషభ్ పంత్ స్థానాన్ని…
జయకేతనం పేరిట జనసేన ఆవిర్బావ వేడుకలు శుక్రవారం అంగరంగ వైభవంగా జరగనున్నాయి. జనసేనాని. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్…
దర్శకధీర రాజమౌళి పలు సందర్భాల్లో చెప్పిన కల లాంటి ప్రాజెక్టు మహాభారతం. చాలా పెద్ద స్కేల్ మీద టాలీవుడ్ టాప్…