హీరోలు ఆడవేషంలో కనిపించడం టాలీవుడ్ లో కొత్తేమి కాదు. కానీ అది కొన్ని నిమిషాలకు మాత్రమే పరిమితమవుతుంది. చంటబ్బాయిలో చిరంజీవిని ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే కామెడీ స్టార్లు ఫుల్ లెన్త్ ఆడ వేషాలతో సూపర్ హిట్లు ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి.
రాజేంద్ర ప్రసాద్ మేడం, నరేష్ చిత్రం భళారే విచిత్రం ఈ క్యాటగిరీలో క్లాసిక్స్ గా నిలిచిపోయాయి. ఆ తర్వాత పేరున్న హీరోలెవరూ ఈ రిస్క్ చేసిన దాఖలాలు అంతగా లేవు. అందులోనూ కొత్త జనరేషన్ లో ఈ సాహసం అస్సలు వద్దంటారు. అయినా విశ్వక్ సేన్ దానికి సిద్ధపడ్డాడు. లైలాగా ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.
లేడీ గెటప్ లో తన లుక్ ఎలా ఉంటుందనే సందేహం ప్రేక్షకుల్లో లేకపోలేదు. తాజాగా టీజర్ లో దానికి క్లారిటీ ఇచ్చేశారు. బ్యూటీ పార్లర్ నడిపే యువకుడు సోను అనుకోకుండా అమ్మాయిలా మారిపోవాల్సి వస్తుంది. అందానికే అందం అనిపించేలా ఉన్న బ్యూటీని చూసి ఎవరెవరో వెంట పడతారు.
దానికన్నా ముందు సోనుతో గొడవలు పడిన బ్యాచు పెద్దదే ఉంటుంది. అసలు కుర్రాడు కుర్రదిగా మారిపోవడానికి కారణం ఏంటి, ఎందుకలా చేయాల్సి వచ్చిందనేది తెరమీద చూడాలి. రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న లైలాకు లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తుండగా ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించింది.
ఇప్పుడీ లైలా కనక వర్కౌట్ అయితే ఇంకొందరు హీరోలు ఇదే బాటలో ప్రయోగాలు చేయొచ్చు. ఫిబ్రవరి 14 విడుదల కాబోతున్న లైలాకు కిరణ్ అబ్బవరం దిల్ రుబాతో పోటీ ఉంది. దానికన్నా వారం ముందు నాగచైతన్య తండేల్ వచ్చి ఉంటుంది. సో టాక్ చాలా కీలకం కానుంది.
గ్యాంగ్స్ అఫ్ గొడవారి, మెకానిక్ రాకీలు మంచి బజ్ తెచ్చుకున్నప్పటికీ ఆశించిన ఫలితం అందుకోలేకపోవడంతో విశ్వక్ సేన్ కు లైలా కీలకం కానుంది. వెరైటీ ప్రమోషన్లు సంక్రాంతికి ముందే మొదలుపెట్టాడు కానీ పండగ హడావిడిలో హైలైట్ కాకపోవడంతో ఆగాడు. తిరిగి వచ్చే వారం నుంచి లైలా కోసం కొత్త రకం పబ్లిసిటీని ప్లాన్ చేస్తున్నారట.
This post was last modified on January 17, 2025 5:51 pm
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…