Movie News

పని లేనప్పుడు ‘పని’కొచ్చే థ్రిల్లర్

మలయాళం సినిమాలు ఈ మధ్య కాలంలో కంటెంట్ ఆధారంగా వచ్చి భాషతో సంబంధం లేకుండా కొన్ని వర్గాల ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. గత రెండేళ్లుగా ఈ ట్రెండ్ బాగా పెరిగింది. దాని తోడు ఓటిటిల్లో తెలుగుతో సహా ప్రధాన భాషల్లో డబ్బింగులు పెడుతుండటంతో సబ్ టైటిల్స్ యాతన నుంచి ఆడియన్స్ తప్పించుకుంటున్నారు.

కిష్కింద కాండం, సూక్ష్మదర్శిని ఆ రకంగానే వర్కౌటయ్యాయి. గత నెల జోజు జార్జ్ ‘పని’ రిలీజయ్యింది. ఇక్కడ కూడా అనువదించి థియేటర్ విడుదల చేశారు కానీ పుష్ప 2 హడావిడిలో మనోళ్లు అస్సలు పట్టించుకోలేదు. తాజాగా ఓటిటిలో వచ్చేసింది.

వైష్ణవ్ తేజ్ ఆదికేశవతో విలన్ గా పరిచయమైనా మల్లువుడ్ నటుడు జోజు జార్జ్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ రివెంజ్ థ్రిల్లర్ ఇది. కథేంటంటే లోకల్ గా పలుకుబడి ఉన్న గిరి (జోజు జార్జ్) భార్య గౌరీ (అభినయ)ని ఒక సూపర్ మార్కెట్ లో ఇద్దరు రౌడీ కుర్రాళ్ళు ఆటపట్టిస్తారు.

గిరి వాళ్లకు గట్టిగా బుద్ది చెబుతాడు. దీంతో ప్రతీకారంతో రగిలిపోయిన ఆ సైకోలు ఓ రాత్రి గౌరీ మీద మానభంగం చేసి పారిపోతారు. వాళ్ళను వెతికే పనిలో పడ్డ గిరి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా దారుణంగా హత్యకు గురవుతారు. చివరికి గిరినే ఆ ఇద్దరిని పట్టుకుని అత్యంత క్రూరంగా చంపేయడంతో ఆ ఫ్యామిలీ చల్లబడుతుంది.

ఒకరకంగా చెప్పాలంటే పని రెగ్యులర్ రివెంజ్ డ్రామానే. కాకపోతే స్క్రీన్ ప్లే కొంత ఆసక్తికరంగా ఉండటంతో తర్వాత ఏం జరుగుతుందాని ఆసక్తి కలిగించడంలో జోజు జార్జ్ కొంత మేర సక్సెసయ్యాడు. బీజీఎమ్, కెమెరా వర్క్ ఇక్కడ ఉపయోగపడ్డాయి. కాకపోతే అంత పెద్ద బిల్డప్ ఇచ్చిన గిరి బ్యాచ్ మరీ అన్యాయంగా చచ్చిపోవడం జీర్ణం కాదు.

అభినయని మానభంగం చేసే ఎపిసోడ్ చూపించిన విధానం మీద కేరళలో అభ్యంతరాలు వచ్చాయి. తర్వాత కొంత ఎడిట్ చేశారు. మొత్తానికి అసలేం పని లేకపోతే, క్రైమ్ థ్రిల్లర్ల మీద విపరీతమైన పిచ్చి ఉంటే పనికొచ్చే క్రైమ్ మూవీగా పని ఉంది.

This post was last modified on January 17, 2025 3:24 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Pani Movie

Recent Posts

కంగువ సౌండ్‌పై విమ‌ర్శ‌లు.. దేవి ఏమ‌న్నాడంటే?

సూర్య సినిమా ‘కంగువా’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఆ…

15 minutes ago

తమన్ భావోద్వేగం… ఆలోచించాల్సిన ఉత్పాతం

సోషల్ మీడియా ప్రపంచంలో రోజురోజుకి నెగటివిటీ ఎక్కువైపోతోంది. ఇది ఏ స్థాయికి చేరుకుందంటే వందల కోట్లు పోసిన ఒక ప్యాన్…

58 minutes ago

రావిపూడి చెప్పిన స్క్రీన్ ప్లే పాఠం

ఇప్పుడు ఫిలిం మేకింగ్ లో కొత్త పోకడలు ఎన్నో వచ్చాయి. గతంలో రచయితలు పేపర్ బండిల్, పెన్ను పెన్సిల్, ఇతర…

1 hour ago

శంకర్ కూతురికీ అదే ఫలితం దక్కింది

ఇండియన్ స్పిల్బర్గ్ గా అభిమానులు పిలుచుకునే దర్శకుడు శంకర్ కొన్నేళ్లుగా తన ముద్ర వేయలేకపోవడం చూస్తున్నాం. 2.0కి ప్రశంసలు వచ్చాయి…

2 hours ago

ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. భార‌త సైన్యం మృతి…

దాదాపు రెండు సంవ‌త్స‌రాల‌కు పైగానే జ‌రుగుతున్న ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం .. ప్ర‌పంచ‌శాంతిని ప్ర‌శ్నార్థ‌కంగా మార్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ…

2 hours ago

ఈ రోజు అనిల్ లేకపోతే మేము లేము…

ఒక‌ప్పుడు నిల‌క‌డ‌గా హిట్లు కొడుతూ దూసుకెళ్లిన అగ్ర‌ నిర్మాత దిల్ రాజు.. గ‌త కొన్నేళ్లుగా స‌రైన విజ‌యాలు లేక ఇబ్బంది…

4 hours ago