ఎప్పటినుంచో అభిమానులు కోరుకుంటున్న కాంబినేషన్ నిజంగా జరిగితే దానికొచ్చే కిక్కు మాములుగా ఉండదు. అందుకే మల్టీస్టారర్లు మనకు అరుదైపోయాయి. రజనీకాంత్ కంబ్యాక్ లో సూపర్ బ్లాక్ బస్టర్ గా నిలిచి జైలర్ కొనసాగింపు ఇటీవలే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
కేవలం అనౌన్స్ మెంట్ కోసమే ప్రత్యేకంగా నాలుగు నిమిషాల వీడియోని సినిమా రేంజ్ లో షూటింగ్ చేశారు. ఇంకా చిత్రీకరణ మొదలుకాక ముందే అంచనాలు ఎక్కడికో వెళ్లిపోతున్నాయి. ముత్తువేల్ పాండియన్ రెండోసారి చేయబోయే విధ్వంసం కోసం అభిమానులు ఓ రేంజ్ లో వెయిట్ చేస్తున్నారు. ఇక అసలు పాయింట్ కొద్దాం.
జైలర్ 2లో నందమూరి బాలకృష్ణ క్యామియో దాదాపు ఖరారేనని ఇన్ సైడ్ టాక్. మొదటి భాగంలో కన్నడ నుంచి శివ రాజ్ కుమార్, మలయాళం నుంచి మోహన్ లాల్ ని భాగం చేసిన దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెలుగులో నుంచి ఎవరినీ తీసుకోలేదు. బాలయ్యని ఒక పోలీస్ గెస్టు పాత్రలో పవర్ ఫుల్ గా అనుకున్నానని కానీ కుదరలేదని అతను గతంలోనే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.
ఇప్పుడది కార్యరూపం దాలుస్తోందని చెన్నై రిపోర్ట్. బాలయ్య, రజిని మధ్య మంచి స్నేహం ఉంది. స్వర్గీయ ఎన్టీఆర్ శతజయంతికి సూపర్ స్టార్ ముఖ్య అతిథిగా వచ్చినప్పుడు అన్నీ దగ్గరుండి చూసుకున్నది బాలయ్యే.
ఇప్పుడిది నిజమైతే మాత్రం బ్లాస్ట్ మాములుగా ఉండదు. ఈ కారణంగానే డాకు మహారాజ్ తమిళ వెర్షన్ రిలీజ్ సందర్భంగా నెల్సన్ దిలీప్ కుమార్ ట్వీట్ చేశాడనే కోణం అభిమానుల్లో ఉంది. రజిని తెలుగు హీరోలతో కొన్నిసార్లు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కాళీలో చిరంజీవి, టైగర్ లో దివంగత ఎన్టీఆర్, కథానాయకుడులో జగపతిబాబు, ఇద్దరు అసాధ్యులేతో పాటు మరికొన్ని సినిమాల్లో కృష్ణతో ఇలా మంచి హిట్లలో భాగమయ్యారు.
బాలయ్య కాంబో మాత్రం కుదరలేదు. జైలర్ 2 కనక దానికి వేదికైతే సంచలనాలు మాములుగా ఉండవు. జస్ట్ అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని ఊహించుకున్నా గూస్ బంప్స్ వచ్చేస్తాయి.
This post was last modified on January 17, 2025 3:03 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…