ఏదో ఒక ప్రత్యేకమైన సందర్భం వస్తే తప్ప కొన్ని బ్లాక్ బస్టర్లకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు బయటికి రావు. నిన్న జరిగిన గాంధీ తాత చెట్టు ఈవెంట్ లో అదే జరిగింది. సుకుమార్ కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి తెరంగేట్రం ఈ సినిమాతో జరుగుతున్న సంగతి తెలిసిందే.
పద్మావతి మల్లాది దర్శకత్వం వహించగా ఆయన భార్య తబిత సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు, వచ్చే వారమే థియేట్రికల్ రిలీజ్ జరుపుకోనుంది. ఈ సందర్భంగా కొత్త దర్శకులకు ఎదురయ్యే అనుభవాలు, కథ చెప్పడంలో ఉండాల్సిన నేర్పు గురించి వివరిస్తూ ఆర్య ఫ్లాష్ బ్యాక్ కోసం రెండు దశాబ్దాలు వెనక్కు వెళ్లారు సుకుమార్.
ఎవరి దగ్గర పని చేసిన అనుభవం లేకపోయినా ఆర్య కథ చెప్పడానికి సుకుమార్ చిరంజీవి దగ్గరికి వెళ్ళినప్పుడు మొదటి సిట్టింగ్ లోనే ఇంప్రెస్ చేశారు. ఇది పంచుకోవడానికి చిరు అల్లు అరవింద్ మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. అరవింద్ వైపు నుంచి కొత్త కుర్రాడు, ఎక్స్ పీరియన్స్ లేదు కదా అనే సంశయం వినిపించింది.
కానీ చిరంజీవి భరోసా ఇచ్చేశారు. కేవలం కెమెరా పార్ట్ తీసినా సినిమా హిట్టే వదిలేసేయ్ అంటూ నమ్మకంగా చెప్పడంతో ఆర్య సెట్స్ కు వెళ్ళింది. ఒకవేళ మెగాస్టార్ కనక ఏ మాత్రం డౌట్ పడినా అల్లు అర్జున్ కు కెరీర్ రెండో సినిమాకే అంత పెద్ద బ్రేక్ దొరికేది కాదన్న మాట వాస్తవం.
ఆసక్తికరంగా ఉంది కదూ. ఇక్కడ సోషల్ మీడియాలోనేమో మెగా ఫ్యాన్స్ అల్లు అభిమానులు ఒకరినొకరు కవ్వించుకుంటూ ఉంటారు. కానీ వాస్తవ పరిస్థితి దానికి భిన్నంగా ఉంటుంది. బన్నీ డెబ్యూ నుంచే మావయ్య ప్రమేయం, సలహాలు ఏ స్థాయిలో ఉపయోగపడ్డాయో చెప్పేందుకు ఈ చిన్న ఉదాహరణ చాలు.
ఆర్య లేకపోతే నేను లేనని అల్లు అర్జున్ పలు సందర్భాల్లో చెప్పడం అందరూ చూశారు. ఇప్పుడు సుకుమార్ క్లారిటీ ఇచ్చాక ఇక ఈ టాపిక్ మీద డిబేట్ అవసరం లేదనిపిస్తుంది. పుష్ప 2 ది రూల్ విజయాన్ని ఆస్వాదించాక సుకుమార్ త్వరలో రామ్ చరణ్ 17 స్క్రిప్ట్ పనులు మొదలుపెట్టబోతున్నారు.
This post was last modified on January 17, 2025 12:13 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…