ఈ సంక్రాంతికి బడ్జెట్, బిజినెస్ లెక్కల్లో చూస్తే బిగ్గెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’యే. తర్వాత డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం వరుస క్రమంలో నిలుస్తాయి. కానీ టాక్, బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ పరంగా చూస్తే ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. లేటుగా రేసులోకి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుండగా.. డాకు మహారాజ్ కూడా బాక్సాఫీస్ దగ్గర బలంగానే నిలబడుతోంది.
‘గేమ్ చేంజర్’ సినిమా ఆక్యుపెన్సీలు క్రమ క్రమంగా పడిపోతున్నాయి. భారీ చిత్రం కావడం, పైగా సంక్రాంతి రేసులో ముందుగా నిలిచిన సినిమా కావడంతో ‘గేమ్ చేంజర్’కు మేజర్ స్క్రీన్లు ఇచ్చారు. డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాల రిలీజ్ టైంకి రెండు రెండు రోజుల గ్యాప్‌లో ‘గేమ్ చేంజర్’కు స్క్రీన్లు తగ్గాయి. ఆ రెండు చిత్రాలు వాటి వాటి స్థాయిలో ఓ మోస్తరుగా అనిపించే స్క్రీన్లలో రిలీజయ్యాయి.
కానీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ రిలీజయ్యాక కథ మారిపోయింది. వెంకీ చిత్రానికి మామూలుగా డిమాండ్ లేదు. తొలి రెండు రోజులు హౌస్ ఫుల్స్‌తో రన్ అయిన ఈ చిత్రానికి టికెట్లు దొరక్క ప్రేక్షకులు ఇబ్బంది పడ్డారు. డిమాండుకు తగ్గ థియేటర్లు లేకపోవడం ఇబ్బంది అయింది. మరోవైపు ‘గేమ్ చేంజర్’ స్క్రీన్లలో జనం లేని పరిస్థితి. ఐతే ఈ రెండు చిత్రాలకూ నిర్మాత దిల్ రాజే. ఆయన రెండు రోజులు వెబ్ చేసి గురువారం నుంచి థియేటర్లను షిఫ్ట్ చేయడానికి నిర్ణయించుకున్నారు.
బుధవారం నైట్ షోలు చూశాక ఆయన ‘గేమ్ చేంజర్’కు థియేటర్లు తగ్గించి, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి ఇచ్చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ విషయంలో రామ్ చరణ్ అభిమానుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నప్పటికీ బిజినెస్ కోణంలో ఆయన ఈ నిర్ణయం తీసుకోక తప్పట్లేదని తెలుస్తోంది.
వీకెండ్లో ‘సంక్రాంతికి వస్తున్నాం’కు మేజర్ స్క్రీన్లు ఉండేలా చూసకుంటే భారీగా ఆదాయం వస్తుందని.. ‘గేమ్ చేంజర్’ డిమాండుకు తగ్గట్లు లిమిటెడ్ స్క్రీన్లలో ఆడితే చాలని ఆయన భావిస్తున్నారు. కాబట్టి వీకెండ్లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ వసూళ్ల మోత మోగించడం ఖాయం.
This post was last modified on January 16, 2025 4:25 pm
ఒకప్పుడు నిలకడగా హిట్లు కొడుతూ దూసుకెళ్లిన అగ్ర నిర్మాత దిల్ రాజు.. గత కొన్నేళ్లుగా సరైన విజయాలు లేక ఇబ్బంది…
హీరోలు ఆడవేషంలో కనిపించడం టాలీవుడ్ లో కొత్తేమి కాదు. కానీ అది కొన్ని నిమిషాలకు మాత్రమే పరిమితమవుతుంది. చంటబ్బాయిలో చిరంజీవిని…
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన గ్యారెంటీలలొ ఇప్పటి వరకు కొన్ని మాత్రమే అమలు చేసింది.…
ఒక్కోసారి ఎంత హిట్టు కొట్టినా ఆశించినంత పేరు రాకపోవడం నటీనటుల విషయంలో జరుగుతుందేమో కానీ దర్శకులకు అరుదు. కానీ సుందర్…
కడపలో ఎం జరిగినా సంచలనమే అవుతోంది. ఈ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా…
పుష్ప-2 సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. హిందీలో అన్ని బాక్సాఫీస్ రికార్డులనూ ఈ…