బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడికి ఒక్కరే కారణమని, అతను ముందు నుంచి ప్లాన్ చేసుకుంటున్న వ్యక్తి కావచ్చని, ఎవరో తెలిసిన వ్యక్తి కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
దాడి చేసిన వ్యక్తి ఎవ్వరికీ చిక్కకుండా జారుకున్నాడు అంటే అతనికి ముందు నుంచే సైఫ్ ఇంటి గురించి తెలిసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇక డైరెక్ట్ గా సైఫ్ కుమారుడు తైమూర్ రూమ్ వద్దకి ఎందుకు వెళ్లారు అనేది మరో ప్రశ్న?. అప్పుడే ఆగంతకుడిని అడ్డుకున్న సైఫ్‌తో జరిగిన పెనుగులాట సమయంలో ఈ దాడి చోటుచేసుకుంది.
దాడి అనంతరం అంత ఈజీగా దుండగుడు ఎలా పారిపోతాడు అనేది మరొక మిస్టరీగా మారింది. వేలాది కోట్ల ఆస్తిపరుడైన సైఫ్ కు సెక్యూరిటీ కూడా బలంగానే ఉంటుంది. ఇక అలాంటిది అంత తేలిగ్గా అతను ఎలా బయటపడ్డాడు అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న. ఇక సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు, తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో దుండగుడు కత్తితో దాడి చేశాడని నిర్ధారించారు.
అయితే, దాడికి ముందు ఎవరు సొసైటీకి వచ్చిన రికార్డులు లేవు, దాంతో దుండగుడు అప్పటికే సొసైటీ లోపలే ఉన్నాడన్న అనుమానం ఉద్భవించింది. గార్డులు ఎవరినీ అనుమానాస్పదంగా చూడలేదని చెప్పడం ఈ అనుమానాలను మరింత పెంచింది. ప్రస్తుతం సైఫ్ సిబ్బందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సైఫ్ కుటుంబం విషయానికి వస్తే, ఘటన సమయంలో ఆయన భార్య కరీనా కపూర్, కుమారుడు తైమూర్ ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారని ధృవీకరించారు.
సైఫ్ మెడ, వెన్నుపక్కన తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే శస్త్రచికిత్స ఒకటి పూర్తి కాగా, ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. సైఫ్ అలీఖాన్, బాలీవుడ్‌లో ప్రముఖ నటుడిగా మాత్రమే కాకుండా, తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’లో రావణాసురుడిగా, ఎన్టీఆర్ నటించిన ‘దేవర’లో భైరవ పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఘటనపై ఎన్టీఆర్, చిరంజీవి కూడా స్పందించారు.
This post was last modified on January 16, 2025 4:00 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…