ఆరు పదుల వయసు దాటిన హీరోలు వేగంగా సినిమాలు చేయడం సులభం కాదు. ఒకవేళ అనుకున్నా వరసగా విజయాలు సాధించడం జరగని పని. చిరంజీవికి వాల్తేరు వీరయ్య ఇచ్చిన ఆనందం భోళా శంకర్ ఆవిరి చేసింది. రజనీకాంత్ కు జైలర్ సంతోషం లాల్ సలాంతో పోయింది.
నా సామిరంగకు ముందు నాగార్జున, సంక్రాంతికి వస్తున్నాంకు ముందు వెంకటేష్ ఎలాంటి ఫలితాలు చూశారో తెలిసిందే. విక్రమ్ తో కంబ్యాక్ ఇచ్చిన కమల్ హాసన్ ఇండియన్ 2తో అవమానం పాలయ్యారు. దాదాపు అందరిదీ ఇంచుమించు ఒకటే కథ. కానీ ఒక్క బాలకృష్ణ మాత్రమే ఇది తనకు వర్తించదనే స్థాయిలో దూసుకుపోతున్నారు.
2021 వరకు బాలయ్యది కూడా పైన చెప్పిన వాళ్ళ స్టోరీనే. కానీ అఖండ మొత్తం మార్చేసింది. కరోనా తగ్గిపోయి జనం థియేటర్లకు రావాలా వద్దాని ఆలోచిస్తున్న సమయంలో అది సాధించిన బ్లాక్ బస్టర్ వసూళ్ల వర్షం కురిపించింది. అఘోరాగా ఆయన నటనకు నార్త్ ఆడియన్స్ సైతం ఫిదా అయ్యారు.
విపరీతమైన పోటీలోనూ వీరసింహారెడ్డి సాధించిన రికార్డులు ఫ్యాన్స్ ఎప్పటికి మర్చిపోలేరు. రెగ్యులర్ మసాలాకు దూరంగా ప్రయత్నించిన భగవంత్ కేసరికి మాస్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ మద్దతు దొరికింది. అవార్డులు, కలెక్షన్లు రెండూ వచ్చాయి. ఏకంగా విజయ్ రీమేక్ చేసుకు స్థాయిలో అద్భుత విజయం సాధించింది.
ఇప్పుడు డాకు మహారాజ్ అదే బాటలో వెళ్తోంది. ఎక్కువ సంభాషణలు లేకుండా బాలయ్యలోని కొత్త మాస్ యాంగిల్ ని ఆవిష్కరించిన తీరు వారం తిరక్కుండానే వంద కోట్ల క్లబ్బు లోకి అడుగు పెట్టింది. ఇలా వరసగా నాలుగు బ్లాక్ బస్టర్లు దక్కించుకున్న ఘనత సీనియర్లలోనే కాదు జూనియర్లలోనూ ఎవరికీ లేదనేది వాస్తవం.
సినిమాలు పక్కనపెడితే తన ఎనర్జీతో అన్ స్టాపబుల్ షోని నాలుగు సీజన్లుగా బ్రహ్మాండంగా నడిపిస్తున్న ఘనత బాలయ్యకే చెందుతుంది. ఒకరిద్దరు మినహాయించి టాలీవుడ్ టాప్ స్టార్లంతా గెస్టులుగా వచ్చారు. కొన్ని ఎపిసోడ్ల దెబ్బకు ఏకంగా ఆహా సర్వర్ క్రాష్ అయిపోయింది.
ఇంకోపక్క హిందూపూర్ ఎమ్మెల్యేగా మూడో పర్యాయం విజయం సాధించడం బాలకృష్ణని రాజకీయంగా మరో మెట్టు పైకి తీసుకెళ్లింది. గతంలో ట్రోలింగ్ చేసిన వాళ్ళు ఇప్పుడు బాలయ్య ప్లానింగ్ కి వాహ్ అంటున్నారు. ఏ స్టార్ హీరోకైనా సెకండ్ ఇన్నింగ్స్ ఉంటుంది. కానీ దాన్ని అప్రతిహతంగా కొనసాగించడం కత్తి మీద సాము లాంటిది.
రీమేకులు ఎంచుకోకుండా కొత్త తరం దర్శకులతో పని చేయడానికి చూపిస్తున్న ఉత్సాహమే బాలయ్య 2.0ని హిట్ మెషీన్ గా మారుస్తోంది. ఇదిలాగే కొనసాగాలని అభిమానుల కోరిక. మోక్షజ్ఞ ఎంట్రీ దగ్గర పడుతున్న టైంలో తండ్రి సాగిస్తున్న జైత్రయాత్ర ఫ్యాన్స్ ఉత్సాహానికి నిరంతరం ఊపిరి పోస్తోంది.
This post was last modified on January 16, 2025 12:41 pm
సూర్య సినిమా ‘కంగువా’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఆ…
సోషల్ మీడియా ప్రపంచంలో రోజురోజుకి నెగటివిటీ ఎక్కువైపోతోంది. ఇది ఏ స్థాయికి చేరుకుందంటే వందల కోట్లు పోసిన ఒక ప్యాన్…
ఇప్పుడు ఫిలిం మేకింగ్ లో కొత్త పోకడలు ఎన్నో వచ్చాయి. గతంలో రచయితలు పేపర్ బండిల్, పెన్ను పెన్సిల్, ఇతర…
ఇండియన్ స్పిల్బర్గ్ గా అభిమానులు పిలుచుకునే దర్శకుడు శంకర్ కొన్నేళ్లుగా తన ముద్ర వేయలేకపోవడం చూస్తున్నాం. 2.0కి ప్రశంసలు వచ్చాయి…
దాదాపు రెండు సంవత్సరాలకు పైగానే జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం .. ప్రపంచశాంతిని ప్రశ్నార్థకంగా మార్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ…
ఒకప్పుడు నిలకడగా హిట్లు కొడుతూ దూసుకెళ్లిన అగ్ర నిర్మాత దిల్ రాజు.. గత కొన్నేళ్లుగా సరైన విజయాలు లేక ఇబ్బంది…