బాలీవుడ్ ఉలిక్కిపడింది. అత్యంత కట్టుదిట్టమైన సెక్యూరిటీ మధ్య విలాసవంతమైన భవంతులు, అపార్ట్ మెంట్లలో నివసించే స్టార్ హీరోలకు సైతం ప్రమాదాలు పొంచి ఉంటాయని తాజా ఉదంతం చాటుతోంది. ఇవాళ తెల్లవారకముందు 2.30 గంటల ప్రాంతంలో ముంబై బాంద్రాలో ఉండే సైఫ్ అలీ ఖాన్ ఇంటి దోపిడీకి ప్రయత్నించిన ఘటనలో తనకు తీవ్ర గాయాలు కలగడం ఆందోళన రేకెత్తిస్తోంది.
పోలీసులు చెబుతున్న దాని ప్రకారం దొంగ చొరబడ్డాక ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగిందని, అతను పొడిచాడా లేక ఆత్మరక్షణలో ప్రతిఘటించిన సైఫ్ కు అందులో భాగంగా గాయాలయ్యాయా అనే దాని మీద విచారణ జరుగుతోంది.
ఘటన జరిగిన గంటలోపే కుటుంబ సభ్యులు లీలావతి ఆసుపత్రిలో చేర్పించారు. భార్య కరీనా కపూర్ తో పాటు ఇద్దరు పిల్లలు అదే సమయంలో ఇంట్లోనే ఉన్నప్పటికీ ఎలాంటి ముప్పు జరగలేదు. సైఫ్ కేకలు విన్నాక హుటాహుటిని హాస్పిటల్ కు తీసుకెళ్లారు.
మొత్తం ఆరు చోట్ల కత్తిపోట్లు ఉన్నాయని, వాటిలో రెండు తీవ్ర స్థితిని సూచిస్తున్నాయని డాక్టర్స్ రిపోర్ట్. సర్జరీ అయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెబుతున్నారు. కపూర్, ఖాన్ ఫ్యామిలీ తరఫున ఒక ప్రెస్ నోట్ వదిలారు. పోలీస్ కేసు కావడం వల్ల వదంతులు నమ్మవద్దని, చికిత్స కొనసాగుతోందని, సంయమనం పాటించాలని కోరారు.
దేవరలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించినప్పటి నుంచి అనుబంధం ఏర్పరుచుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఘటన గురించి తెలిసిన వెంటనే క్షేమం కోరుకుంటూ ఎక్స్ ద్వారా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. ముంబైలో ఉన్న ఇతర హీరోలు నటీనటులు వెంటనే లీలావతికి వెళ్లి సైఫ్ యోగక్షేమాలు తెలుసుకునే పనిలో పడ్డారు.
ఆ మధ్య షారుఖ్, సల్మాన్ లకు ఇలాంటివి జరిగే అవకాశముందని నిఘా వర్గాలు చెప్పడం సంచలనం రేపింది. భద్రత కూడా పెంచారు. కానీ అనూహ్యంగా సైఫ్ మీద అటాక్ జరగడం ఎవరూ ఊహించనిది. కేవలం దొంగతనమా లేకా ఇంకేదైనా కుట్రకోణం ఉందానేది ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది.
This post was last modified on January 16, 2025 10:30 am
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్‌పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…