మూడేళ్ళకు పైగా ఒకే సినిమాకు కేటాయించి ఎంతో కష్టపడిన గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకొచ్చాక రామ్ చరణ్ ఇటు మీడియాకు అందుబాటులో రావడం కానీ, సక్సెస్ మీట్ లాంటి వాటిలో కనిపించడం కానీ చేయలేదు. సైలెంట్ గా ఇన్స్ టా ద్వారా ఒక ఓపెన్ లెటర్ పెట్టేసి మూవాన్ అయిపోయాడు.
గేమ్ ఛేంజర్ కు తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుందని, అందరూ ఎంతో కష్టపడ్డారని కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇకపై పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసే మరిన్ని మంచి పాత్రలతో వస్తానని సంక్రాంతి శుభాకాంక్షలను పొందుపరిచాడు. ప్రత్యేకంగా డైరెక్టర్ శంకర్ కు ఇంత మంచి అవకాశమిచ్చినందుకు కృతజ్ఞత తెలియచేశాడు.
మిక్స్డ్ టాక్ తో గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద ఫలితం తేల్చుకునే దిశగా వెళ్తోంది. వారం రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది. ఇంకా ఫైనల్ స్టేటస్ తేలలేదు కానీ మొదటిరోజు కలెక్షన్ ఫిగర్ వదిలాక టీమ్ సైలెంట్ అయిపోయింది. ఎస్విసి బృందం ఎలాంటి ఈవెంట్లు చేయలేదు.
విజయం సాధించిన దానికి సూచనగా సెలబ్రేషన్స్ లాంటివి కనిపించలేదు. పైపెచ్చు హెచ్డి ప్రింట్ పైరసీ రాద్ధాంతం తలనొప్పిగా మారడంతో వ్యవహారం సైబర్ క్రైమ్ దాకా వెళ్ళిపోయింది. ఇంకోవైపు గేమ్ ఛేంజర్ కన్నా మెరుగైన టాక్ తో డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం డామినేట్ చేయడం ఫలితమేంటో చెప్పేస్తోంది.
ఇక మెగా ఫ్యాన్స్ దృష్టి ఆర్సి 16 వైపు వెళ్తోంది. ప్రకటన దశ నుంచే బుచ్చిబాబు దీని గురించి మాములు అంచనాలు రేపలేదు. ఏఆర్ రెహమాన్, శివ రాజ్ కుమార్, జాన్వీ కపూర్ లాంటి పేర్లు క్రేజ్ ని అమాంతం పెంచేశాయి. వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే 2026 సంక్రాంతికి దింపాలని అభిమానుల కోరిక.
ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి అదంత సులభంగా నెరవేరుతుందని చెప్పలేం. ఈ నెలలోనే కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇదయ్యాక సుకుమార్ డైరెక్షన్ లో ఆర్సి 17 ఉంటుంది. పుష్ప 2 ఫైనల్ రన్ అయిపోయింది కాబట్టి స్క్రిప్ట్ పనులు త్వరలోనే మొదలుకానున్నాయి.
This post was last modified on January 16, 2025 10:04 am
ఒకప్పుడు నిలకడగా హిట్లు కొడుతూ దూసుకెళ్లిన అగ్ర నిర్మాత దిల్ రాజు.. గత కొన్నేళ్లుగా సరైన విజయాలు లేక ఇబ్బంది…
హీరోలు ఆడవేషంలో కనిపించడం టాలీవుడ్ లో కొత్తేమి కాదు. కానీ అది కొన్ని నిమిషాలకు మాత్రమే పరిమితమవుతుంది. చంటబ్బాయిలో చిరంజీవిని…
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన గ్యారెంటీలలొ ఇప్పటి వరకు కొన్ని మాత్రమే అమలు చేసింది.…
ఒక్కోసారి ఎంత హిట్టు కొట్టినా ఆశించినంత పేరు రాకపోవడం నటీనటుల విషయంలో జరుగుతుందేమో కానీ దర్శకులకు అరుదు. కానీ సుందర్…
కడపలో ఎం జరిగినా సంచలనమే అవుతోంది. ఈ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా…
పుష్ప-2 సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. హిందీలో అన్ని బాక్సాఫీస్ రికార్డులనూ ఈ…