Movie News

సహించలేని స్థాయికి పైరసీ భూతం

బడ్జెట్ ఎంతనేది పక్కనపెడితే సినిమాలన్నాక బ్లాక్ బస్టర్లు, డిజాస్టర్లు అన్నీ ఉంటాయి. చరిత్రలో ఎన్నోసార్లు జరిగింది, భవిష్యత్తులో కూడా ఎన్నో చూడబోతున్నాం. ఇది సహజం. పైరసీ కూడా కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. వీడియో క్యాసెట్ల జమానా నుంచే ఇండస్ట్రీని పీడిస్తోంది. కానీ టెక్నాలజీ పెరిగిపోయాక తీవ్ర రూపం దాలుస్తోంది.

తాజాగా విడుదలైన గేమ్ ఛేంజర్ విషయంలో జరుగుతున్న అన్యాయం ఎంత మాత్రం సహించలేని స్థాయికి చేరుకుంటోంది. వైజాగ్ ప్రాంతంలోని ఒక ఏరియా లోకల్ కేబుల్ ఛానల్ ఈ ప్యాన్ ఇండియా మూవీని ప్రసారం చేయడం, దాని తాలూకు పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడం జరిగిపోయాయి.

విడుదలకు ముందు నుంచే ఈ కుట్రకు శ్రీకారం చుట్టారని ఇటీవలే ఎస్విసి సంస్థ 45 మందిపై ఫిర్యాదు చేస్తూ పోలీస్ కంప్లయింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాని మీద విచారణ జరుగుతుండగానే టీవీలో టెలికాస్ట్ కావడం దారుణం. ఇక్కడే కాదు మొన్నెక్కడో ప్రైవేట్ బస్సులో వేసిన సాక్ష్యం బయటికొచ్చింది.

హోటల్ లో చెఫ్ తో మొదలుపెట్టి హాస్పిటల్ సెక్యూరిటీ గార్డ్ దాకా అందరి దగ్గరికి పైరసీ కాపీ చేరిపోయింది. ఇది గేమ్ ఛేంజర్ కొకటే జరిగింది కాకపోయినా ఇంత స్థాయిలో పైరసీ కంటెంట్ ని మూలమూలలకు తీసుకెళ్లడం ఖండించాల్సిన విషయం. ఎస్కెఎన్, మధుర శ్రీధర్ లాంటి ప్రముఖులు గళం విప్పుతున్నారు.

గేమ్ ఛేంజర్ హెచ్డి పైరసీకి గురైతే డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాంలకు సైతం ఈ సెగ తాకింది. కాకపోతే క్వాలిటీ లేకపోవడం వల్ల డ్యామేజ్ తగ్గుతుంది. ఇకనైనా పరిశ్రమ ఒక్కతాటిపైకి వచ్చి పైరసీని ఎలా కట్టడి చేయాలనే దాని మీద ప్రణాళిక వేసుకోవడం అవసరం.

అయితే ప్రపంచం మొత్తం కొన్ని వేలాది స్క్రీన్లలో ఒకే సినిమా రిలీజవుతున్నప్పుడు పైరసీని అరికట్టడం దుర్లభంగా మారుతోంది. మూలాలు వెతికేలోపు బోలెడు ఖర్చు కావడమే కాక థియేట్రికల్ రన్ పూర్తయిపోతోంది. అందుకే ఈ ఇష్యూలో సీరియస్ నెస్ రావడం లేదు. ఇంటర్నేషనల్ ఓటిటిలకు కూడా ఈ బెడద తప్పడం లేదు.

This post was last modified on January 16, 2025 7:44 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

లక్షలాది అఘోరాల మధ్య అఖండ 2 తాండవం

హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ పూర్తి చేసుకుని మరో సంచలనం కోసం అఖండ 2 తాండవం మొదలుపెట్టిన దర్శకుడు బోయపాటి శీను…

11 hours ago

పుష్ప నచ్చనివాళ్ళకు గాంధీ తాత చెట్టు

రాజమౌళి రికార్డులని దాటేసే స్థాయిలో పుష్ప 2 ది రూల్ తో ఆల్ టైం ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ సృష్టించిన…

12 hours ago

కొడుకును స్టార్‌ను చేయలేకపోవడంపై బ్రహ్మి…

టాలీవుడ్ హీరోల లిస్టు తీస్తే అందులో 70-80 శాతం వారసులే కనిపిస్తారు. ఒకప్పుడు కేవలం హీరోల కొడుకులు మాత్రమే హీరోలయ్యేవారు.…

12 hours ago

2025 సంక్రాంతి.. నెవర్ బిఫోర్ రికార్డు

సంక్రాంతికి ప్రతిసారీ మూడు నాలుగు సినిమాలు రిలీజ్ కావడం మామూలే. కానీ వాటిలో ఒకటి రెండు మంచి టాక్ తెచ్చుకుని…

13 hours ago

ఆకాశంలో మరో అద్బుతం.. గెట్ రెడీ!

ఈ నెల 25న ఆకాశంలో అరుదైన ప్లానెట్స్ పరేడ్ జరగనుంది. సూర్యవ్యవస్థలోని ఆరు గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చే ఈ…

14 hours ago

టీమిండియా న్యూ బ్యాటింగ్ కోచ్.. ఎవరతను?

భారత జట్టులో మార్పులు చోటు చేసుకుంటున్న తరుణంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ బాధ్యతలను సితాంశు కోటక్ చేపట్టనున్నారు. ఇటీవల టీమిండియా…

15 hours ago