సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో పెర్ఫార్మన్స్ పరంగా వెంకటేష్ తర్వాత ఎక్కువ స్కోప్ దొరికింది ఐశ్యర్య రాజేష్ కే. గ్లామర్ పరంగా మీనాక్షి చౌదరికి యూత్ ని ఆకర్షించే ఛాన్స్ ఉన్నప్పటికి నటనతో డామినేట్ చేసింది మాత్రం ఐశ్వర్య. వైవి రాజు భార్య భాగ్యంగా ఒకపక్క అమాయకత్వం, ఇంకోపక్క చదువులేని నిస్సహాయత, వీటిని మించి బావ అంటే విపరీతమైన ప్రేమ.
ఇన్ని కలగలసిన పక్కా పదహారణాల తెలుగు సతీమణి పాత్రలో తన బెస్ట్ ఇచ్చేసింది. గోదారి గట్టు మీద పాటలో గొప్ప విజువల్స్ లేకపోయినా వెంకీ లేని ఫ్రేమ్స్ లో ఈ అమ్మాయి చేసిన డాన్స్ మాస్ జనాలను బాగా మెప్పించింది.
నిజానికి భాగ్యంగా అనిల్ రావిపూడి మొదటి ఛాయస్ ఐశ్యర్య రాజేష్ కాదు. వేరే ఇద్దరు ముగ్గురిని అడిగాడు. కానీ నలుగురు చిన్న పిల్లల తల్లి అనేసరికి వాళ్ళు వెనుకడుగు వేశారు. కానీ కథ ప్రకారం హైలైట్ అయ్యేది బుల్లిరాజు ఒక్కడే అనే పాయింట్ గుర్తించలేకపోయారు.
దీంతో వద్దనుకున్నారు. కట్ చేస్తే క్యారెక్టర్ లో ఎంత వెయిట్ ఉందో గుర్తించిన ఐశ్యర్య రాజేష్ ఆలోచించకుండా ఎస్ చెప్పేసింది. వెంకటేష్ లాంటి సీనియర్ ఆర్టిస్ట్ అయినా సరే తనకు ఎంత స్కోప్ ఉందో పసిగట్టింది. కామెడీ పరంగానూ ప్రూవ్ చేసుకుంది. ఉదాహరణ చెప్పాలంటే పప్పా పాండేను రోడ్డు మీద తోసే ఎపిసోడ్ చాలు.
ఇలా ఇతరులు తిరస్కరించిన విషయాన్ని ఐశ్వర్య రాజేష్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అయినా పిల్లల తల్లిగా నటించినంత మాత్రాన ఆఫర్లకు కొదవేమి ఉండదు. మహానటిలో కీర్తి సురేష్ ఏకంగా వయసు మళ్ళిన పాత్రలో జీవించింది. దాని తర్వాత మహేష్ బాబు, విక్రమ్, విజయ్ లాంటి స్టార్ల సరసన ఛాన్సులు వచ్చాయి.
సౌందర్య సైతం గతంలో ఇలాంటి రిస్కులు చేసే స్టార్ ఆఫర్లు దక్కించుకున్నారు. ఐశ్యర్య రాజేష్ ఆ రేంజని చెప్పడం లేదు కానీ సరైన బ్రేక్ దొరికితే మంచి అవకాశాలు తలుపు తడతాయి. టాలీవుడ్ లో అలాంటి మలుపు కోసమే ఎదురు చూసిన తెలుగమ్మాయికి ఆ కోరిక నెరవేరింది.
This post was last modified on January 15, 2025 3:12 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…