క్వీన్, మణికర్ణిక లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌తో ఒక టైంలో బాలీవుడ్లో తిరుగులేని స్థాయిని అందుకుంది కంగనా. అప్పట్లో ఆమెకు సాటి వచ్చే కథానాయికే బాలీవుడ్లో కనిపించలేదు. కానీ సక్సెస్‌ను తలకెక్కించుకుని.. అనవసర వివాదాల్లో తలదూర్చి, అతిగా మాట్లాడ్డం ద్వారా క్రమంగా తన మీద ప్రేక్షకుల్లో వ్యతిరేకతను పెంచుకుంది కంగనా.
రాజకీయాల్లోకి వచ్చి ఎంపీ అయితే అయింది కానీ.. కథానాయికగా తన రేంజ్ మాత్రం పడిపోయింది. ఆమె సినిమాలకు కొన్నేళ్ల నుంచి మినిమం ఓపెనింగ్స్ కూడా ఉండట్లేదు. ధకడ్ అనే సినిమా మీద వంద కోట్ల బడ్జెట్ పెడితే వసూళ్లు ఐదు కోట్లు కూడా రాని పరిస్థితి. దీని తర్వాత కంగన నుంచి రావాల్సిన ప్రెస్టీజియస్ మూవీ ‘ఎమర్జన్సీ’ అయితే వాయిదాల మీద వాయిదాలు పడుతూ విడుదలకే నోచుకోలేదు.
ఇక ఈ సినిమా రిలీజే కాదేమో అనుకున్న టైంలో కొత్త విడుదల తేదీ ఇచ్చారు. ఈ నెల 20న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐతే సినిమాకు పెద్దగా బజ్ లేని నేపథ్యంలో ఎలాగైనా ఆడియన్స్ దృష్టిని ఆకర్షించేందుకు కంగనా అండ్ టీం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. టికెట్ల ధరలను బాగా తగ్గించి రూ.99కే సినిమా చూసే అవకాశం కల్పిస్తోంది. సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ అని తేడా లేకుండా అన్ని చోట్లా ఒకే రేట్ పెట్టేశారు.
ప్రీమియం మల్టీప్లెక్సులు కొన్ని మాత్రం రూ.112 రేటు పెట్టాయి. ముంబయి, ఢిల్లీ లాంటి నగరాల్లో ఈ రేటుతో సినిమా చూసే అవకాశం రావడం విశేషమే. మరి ఈ డిస్కౌంట్ రేట్లతో అయినా కంగనా సినిమాను ప్రేక్షకులు చూస్తారా అన్నది ఆసక్తికరం. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ నాటి పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో ఇందిరాగాంధీ పాత్రను పోషించడమే కాక.. స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందించింది కంగనా.
ఐతే బీజేపీ వాళ్లు కొన్నేళ్ల నుంచి తెర వెనుక ఉండి తీయిస్తున్న ప్రాపగండా సినిమాల్లో ఒకటిగా దీన్ని ప్రేక్షకులు భావిస్తుండడం.. కంగనా మీద పెరిగిన వ్యతిరేకత వల్ల మినిమం బజ్ క్రియేట్ కాలేదు ఈ మూవీ మీద. మరోవైపు ఇందిరా గాంధీని బ్యాడ్ లైట్లో చూపించేలా ఉన్న ఈ సినిమాను కాంగ్రెస్ వాళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలని కూడా చూస్తున్నారు.
This post was last modified on January 15, 2025 12:59 pm
మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు లెక్కలేసుకుని సినిమాలు చేసేవారు. కానీ ఈ మధ్య ఆయన తీరు మారిపోయింది. ఇమేజ్ ఛట్రం నుంచి…
సందీప్ రెడ్డి వంగా.. ఏదైనా మాట్లాడితే ఆ మాటను చుట్టూ తిప్పే రకం కాదు. రోమాంచకం ట్రైలర్ ఈవెంట్‌లో స్పిరిట్,…
అమెరికా వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్‌మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తాజా…
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్…
మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…