Movie News

పుష్ప 2 రీ లోడ్ కోసం కొత్త స్ట్రాటజీలు

ఇంకో రెండు రోజుల్లో పుష్ప 2 ది రూల్ రీ లోడెడ్ వెర్షన్ ఇరవై నిమిషాల అదనపు ఫుటేజ్ తో విడుదల కానుంది. ఫైనల్ రన్ కు దగ్గరగా ఉన్నప్పటికీ ప్రస్తుతం కొనసాగుతున్న థియేటర్ల వసూళ్లు డీసెంట్ గానే ఉన్నాయి. సెలవు రోజుల్లో బుక్ మై షోలో కనిష్టంగా పాతిక వేలకు పైగానే ఇప్పటికీ టికెట్లు అమ్ముడుపోవడం దానికి సాక్ష్యం.

ముఖ్యంగా ఉత్తరాదిలో స్క్రీన్ కౌంట్ ఇంకా కొనసాగుతోంది. గేమ్ ఛేంజర్ కొంత ప్రభావం చూపించినప్పటికీ మరీ తీవ్రంగా కాకపోవడం పుష్పరాజ్ కు కలిసి వచ్చింది. ఇప్పుడు ఎక్స్ ట్రాగా చూడబోతున్న సినిమాలో ఏం ఉండబోతోందనే ఆసక్తి అభిమానుల్లోనే కాదు సగటు ప్రేక్షకుల్లోనూ ఉంది.

చాలా మంది మళ్ళీ చూడాలనే నిర్ణయం తీసుకున్నారు. అయితే సంక్రాంతికి వస్తున్నాం బాక్సాఫీస్ వద్ద జోరుగా ఉండటం, డాకు మహారాజ్ సూపర్ హిట్ టాక్, గేమ్ ఛేంజర్ కొనసాగింపు లాంటి కారణాల దృష్ట్యా పుష్ప 2కి ఎక్కువ థియేటర్లు అందుబాటులో లేవు. ఉన్నవి హౌస్ ఫుల్స్ పడితే అదనంగా జోడించేందుకు డిస్ట్రిబ్యూటర్లు ముందుకు వస్తారు.

దానికి అనుగుణంగానే మైత్రి ఒక ప్రత్యేక ప్రమోషన్ ప్లాన్ సిద్ధం చేసిందని సమాచారం. టికెట్ రేట్లు బాగా తగ్గించేసి సామాన్యులు సైతం వచ్చేలా ఆకర్షించడం అందులో మొదటిది. నాలుగు గంటలకు దగ్గరగా తక్కువ రేట్ లో ఏసి ఎంటర్ టైన్మెంట్ మంచి ఆప్షనేగా.

ఒక రోజు ముందు నుంచి కొత్త ప్రోమోలు, ట్రైలర్లు సిద్ధం చేస్తున్నారని టాక్. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ ని లక్ష్యంగా పెట్టుకుని వాళ్ళను ఆకట్టుకోవడం మీద ప్రత్యేక దృష్టి పెట్టారట. ఎక్స్ ట్రా 20 నిముషాల్లో పాట ఉండకపోయినా జపాన్ ఎపిసోడ్ తో పాటు పుష్ప షేఖావత్ మధ్య కొన్ని కీలక సన్నివేశాలు, ఫైట్లు గట్రా ఇందులో ఉండబోతున్నాయనేది ఇన్ సైడ్ న్యూస్.

సంధ్య ఘటన తర్వాత అల్లు అర్జున్ దీనికి డబ్బింగ్ చెప్పారు. రీ రికార్డింగ్, ఎడిటింగ్ తదితర వ్యవహారాలన్నీ సుకుమార్ దగ్గరుండి చూసుకున్నారు. ఇది కనక వర్కౌట్ అయితే మాత్రం భవిష్యత్తులో ఇదో కొత్త ట్రెండ్ గా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Kumar

Recent Posts

సాయికృష్ణది లాకప్ డెత్… తేల్చిన సిట్

విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర…

27 minutes ago

‘దారులున్నాయి’ మాటలో అంత అర్థముందా

పెద్ది విజయోత్సవ వేడుకలో చిరంజీవి నేషనల్ అవార్డు గురించి ప్రస్తావిస్తూ రామ్ చరణ్ కది రావడం రాకపోవడం అసలు సమస్యే…

3 hours ago

హత్యలు చేసే డాక్టర్… చూసినట్టు ఉందే

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మిస్తున్న 'ధర్మన్' ఇవాళ ఘనంగా ప్రారంభమయ్యింది. దర్శకులు మారుతూ వచ్చిన ఈ…

3 hours ago

సత్యదేవ్ ఆశలన్నీ బహదూర్ మీదే

ఇంకో పది రోజుల్లో రావు బహదూర్ విడుదల కానుంది. సత్యదేవ్ ఎప్పుడూ లేనంత వైవిధ్యంగా వివిధ గెటప్స్ లో ఇందులో…

3 hours ago

గూండా ఎమోషన్ గుర్తు చేసిన మెగాస్టార్

నిన్న పెద్ది సక్సెస్ మీట్ ఘనంగా జరిగింది. ప్రత్యేక ఆకర్షణగా చిరంజీవి నిలిచారు. గతంలో తండ్రి కొడుకుల స్టేజి కలయిక…

4 hours ago

పేరు చెబితే ల‌క్ష… స‌ర్కారు బంప‌ర్ ఆఫ‌ర్‌!

ప్ర‌భుత్వాలు చేప‌ట్టే కీల‌క కార్య‌క్ర‌మాల‌కు పేర్లు సూచించే వారికి బ‌హుమానాలు ఇస్తుంటాయి. అలానే కానుక‌లు కూడా ఇస్తాయి. గ‌తంలో స్వ‌చ్ఛ…

7 hours ago