Movie News

జైలర్ 2 – మొదలెట్టకుండానే సంచలనం

ఏదైనా పెద్ద సినిమా షూటింగ్ మధ్యలోనో లేదా పూర్తయ్యాకనో టీజర్ లేదా గ్లింప్స్ వదలడం సహజం. కానీ అసలు సెట్స్ పైకి వెళ్లకుండానే నాలుగు నిమిషాల వీడియోని రిలీజ్ చేయడం జైలర్ 2 కే సాధ్యమయ్యింది. మొన్నటి ఏడాది విడుదలై తమిళంతో పాటు తెలుగులోనూ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన జైలర్ కొనసాగింపుకు రంగం సిద్ధమయ్యింది.

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూరుస్తుండగా రిటైర్డ్ పోలీస్ గా ముత్తువేల్ పాండియన్ చేయబోయే విధ్వంసాలు ఈసారి నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నాయి. దానికి శాంపిల్ గానే అనౌన్స్ మెంట్ టీజర్ వదిలారు.

నెల్సన్, అనిరుద్ ఎలెక్ట్రిక్ మెడిటేషన్ లో ఉండగా తలుపులు బద్దలు కొట్టుకుని గుండాలు రావడం, వెనుకే రజనీకాంత్ వాళ్ళను తుపాకీ, కత్తితో ఊచకోత కోస్తూ రావడం మాములు వయొలెంట్ గా లేదు. తర్వాత బయటికి వచ్చాక మిలటరీ వార్ ట్యాంక్స్ తో వందల కొద్దీ గూండాలు మెషీన్ గన్లు గురి పెడితే అవన్నీ గాల్లో పేలిపోయి స్టైలిష్ గా రజని వాటి ముందు నుంచి నడుచుకుంటూ రావడం మాములు ఎలివేషన్ ఇవ్వలేదు.

యధావిధిగా అనిరుద్ సిగ్నేచర్ బీజీఎమ్ దాని స్థాయిని ఇంకాస్త పెంచింది. ఇంకా చిత్రీకరణ మొదలుకాలేదు కాబట్టి క్యాస్టింగ్ తదితర వివరాలు ఏవి వెల్లడించలేదు.

చెన్నై టాక్ ప్రకారం జైలర్ 2 కొనసాగింపు మొదటి భాగం క్లైమాక్స్ నుంచే ఉంటుంది. కొడుకు పాత్ర, విలన్ తప్ప మిగిలిన అందరూ జీవించే ఉన్నారు కనక వాళ్ళను కొనసాగిస్తూనే కొత్త గ్యాంగ్ ని సెట్ చేయబోతున్నారు. మనవడు, కోడలు, భార్యతో పాటు ఫ్యామిలీకి సంబంధించిన మరో ట్విస్టు జోడించారని అంటున్నారు.

ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ కూలి పూర్తి చేసే పనిలో ఉన్న రజని ఈ వేసవిలోగా ఫ్రీ అవుతారు. వెంటనే జైలర్ 2 స్టార్టవుతుంది. 2026 సంక్రాంతి లేదా ఆపై వేసవి విడుదలని టార్గెట్ గా పెట్టుకున్నారు. బాహుబలి 2, కెజిఎఫ్ 2, పుష్ప 2 తరహాలో జైలర్ 2 సంచలనమవుతుందనే అంచనాలు భారీగా ఉన్నాయి.

This post was last modified on January 14, 2025 6:43 pm

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

4 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

5 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

7 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

7 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

7 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

7 hours ago