ఇటీవలే విడుదలైన గేమ్ ఛేంజర్ మొదటి రోజే హెచ్డి క్వాలిటీతో పైరసీ ప్రింట్ ప్రత్యక్షం కావడం అభిమానులను నివ్వెరపరిచింది. రెగ్యులర్ గా ఆన్ లైన్ వ్యవహారాలతో టచ్ ఉన్న వాళ్లకు ఇది తెలిసిన విషయమే. తక్కువ నాణ్యతతో సరిగా వినిపించని థియేటర్ సౌండ్ తో లీకులు జరగడం ఎప్పటి నుంచో ఉన్నదే.
కానీ ఇలా షాకిచ్చేలా సినిమా మొత్తం బయటికి వచ్చేయడం ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. దీని వెనుక ఉన్నదెవరో కనుక్కునేందుకు నిర్మాత దిల్ రాజు బృందం రంగంలోకి దిగింది. అసలేం జరిగిందనే దాని మీద పోలీసులకు కంప్లయింట్ చేయడం నుంచి చర్యలు మొదలుపెట్టింది.
గేమ్ ఛేంజర్ విడుదలకు ముందే పలువురు టీమ్ లోని కీలక సభ్యులకు కొందరు సోషల్ మీడియా, వాట్సాప్ ద్వారా మెసేజులు పంపించి భారీ మొత్తాన్ని డిమాండ్ చేశారు. ఒకవేళ ఇవ్వకపోతే హెచ్డి ప్రింట్ లీక్ చేస్తామని బెదిరించడంతో పాటు సినిమాకు సంబంధించిన కొన్ని కీలకమైన ట్విస్టులను ఎక్స్ తదితర మాధ్యమాల్లో షేర్ చేశారు.
రిలీజ్ తర్వాత వాళ్ళు అన్నంత పని చేయడంతో పాటు వివిధ మార్గాల్లో వేలాది మందికి షేర్ చేశారు. దాని ప్రభావం వసూళ్ల మీద తీవ్రంగా పడింది. ఈ కుట్ర వెనుక 45 మందికి పైగా ఉన్నారని గుర్తించి పూర్తి ఆధారాలతో పాటు వాళ్ళ మీద ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం విచారణ జరుగుతోంది.
నిజానిజాలు ఎలాగూ బయట పడతాయి కానీ ఇది మాత్రం ప్రతిఒక్కరు తీవ్రంగా ఖండించాల్సిన దారుణం. మూడు సంవత్సరాలకు పైగా నిర్మాణంలో ఉండి, వందల కోట్ల పెట్టుబడిని మోస్తూ, ఇండియా నుంచి ఓవర్సీస్ దాకా పెద్ద బిజినెస్ జరుపుకుని థియేటర్లలో వచ్చిన సినిమా ఇలా అన్యాయానికి గురి కావడం చిన్న నేరం కాదు.
పైరసీ కట్టడికి ప్రభుత్వాల నుంచి ఇంకా ఎక్కువ సహకారం కావాలని ఇండస్ట్రీ డిమాండ్ చేస్తున్న టైంలో గేమ్ ఛేంజర్ ఉదంతం ఒక హెచ్చరిక లాంటిది. గత రెండు నెలలుగా ఇతర తమిళ, హిందీ సినిమాలు కూడా హెచ్డి పైరసీ బారిన పడ్డాయి. త్వరగా దోషులను బయటికి తేవడం అత్యవసరం.
This post was last modified on January 13, 2025 5:03 pm
డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకునే వారికి ఆంధ్రప్రదేశ్‌లో కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. లెర్నర్ లైసెన్స్ కోసం ఇప్పటివరకు స్లాట్ బుక్…
సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి. ఏదైనా పని జరగాలి, మెసేజ్ జనానికి చేరాలి అంటే.. దీని ద్వారా…
నిన్న ఆదర్శ కుటుంబం ఏకె 47 నుంచి విడుదలైన నారాయణమ్మ పాట సోషల్ మీడియాలో డిస్కషన్ కు దారి తీస్తోంది.…
ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువతకు ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ చేసిన సూచన ఇప్పుడు వైరల్ అవుతోంది. ఉద్యోగం…
ఈ రోజుల్లో మంచి పని చేయడం ఎంత ముఖ్యమో...ఆ పనిపై జరిగే విషప్రచారాన్ని ఖండించడం కూడా అంతే ముఖ్యం. మరీ…
రాత్రి నిద్రపోయే ముందు ఫోన్ చూడటం చాలామందికి అలవాటుగా మారిపోయింది. గదిలో లైట్లు ఆపేసిన తర్వాత కూడా మొబైల్ స్క్రీన్…