Movie News

సోలోగా వచ్చి ఉంటే ‘గేమ్’ మారేది!

సంక్రాంతి రిలీజుల్లో రెండు వచ్చేశాయి. డాకు మహారాజ్ సూపర్ హిట్ దిశగా వెళ్తున్నట్టు మొదటి రోజు వసూళ్లు స్పష్టం చేస్తున్నాయి. గేమ్ ఛేంజర్ మిక్స్డ్ టాక్ కలెక్షన్ల మీద ప్రభావం చూపిస్తోంది. హిందీలో పర్వాలేదనుకున్నా తెలుగులో మాత్రం నెమ్మదించిపోవడం బయ్యర్లను కొంత ఆందోళనకు గురి చేస్తోంది.

సంక్రాంతి సెలవులు జనవరి 19 దాకా ఉన్నాయి కాబట్టి వీలైనంత ఆలోపే రాబట్టుకోవడం కీలకం కానుంది. మొదటి రోజు వసూళ్లను 186 కోట్లుగా ప్రకటించిన నిర్మాణ సంస్థ తర్వాత సైలెంటయ్యింది. బహిర్గత పరిచిన నెంబర్ల మీద సోషల్ మీడియాలో వచ్చిన నెగటివిటినే కారణంగా చెప్పుకుంటున్నారు.

పండగ టాపిక్ ని కాసేపు పక్కనపెడితే గేమ్ ఛేంజర్ కనక ఇప్పుడు కాకుండా ముందు అనుకున్నట్టు డిసెంబర్ లో సోలోగా లేదా ఫిబ్రవరి మార్చిలో సింగల్ గా వచ్చి ఉంటే ఎలా ఉండేదన్న చర్చ అభిమానుల్లో జరుగుతోంది. ఒకవేళ నిజంగా అలా చేసుకుంటే కంటెంట్ అయితే మారేది కాదు కానీ రెస్పాన్స్ పరంగా మరింత మెరుగ్గా ఉండేదన్న మాట వాస్తవం.

గత ఏడాది పుష్ప 2, దేవర, కల్కి లాంటివన్నీ ఏ కాంపిటేషన్ లేకుండా వచ్చినవి. కానీ గేమ్ ఛేంజర్ ఒకేసారి డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాంతో తలపడాల్సి రావడంతో చిక్కులు తప్పలేదు. ఇక్కడ తమిళ వెర్షన్ ప్రస్తావన కూడా తేవాలి.

దర్శకుడు శంకర్ బ్రాండ్ మీద ఎక్కువ మార్కెటింగ్ జరిగిన గేమ్ ఛేంజర్ కు తమిళంలో విశాల్ మదగజరాజా, బాలా వనంగాన్, జయం రవి కాథలిక్క నేరమిల్లై స్పీడ్ బ్రేకర్స్ లా అడ్డుపడ్డాయి. తెలుగుని మినహాయించి కేవలం తమిళం మాత్రమే తీసుకున్నా గేమ్ ఛేంజర్ కు పది కోట్ల లోపే వచ్చిందనే ట్రేడ్ టాక్ ఆందోళన కలిగించేదే.

ఇండియన్ 2, ఐ కన్నామెరుగ్గా ఉన్నా గేమ్ ఛేంజర్ కేవలం పోటీలో ఉండటం వల్లే ఎక్కువ ప్రభావితం కావడం రేంజ్ మారుస్తోంది. ఇంకోవైపు ప్రొడక్షన్ హౌస్, హీరో, దర్శకుడు అందరూ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లను పక్కన పెట్టేశారు. కనీసం వారం పది రోజులు సౌండ్ చేసి ఉంటే బాగుండేదని మెగా ఫ్యాన్స్ కామెంట్.

This post was last modified on January 13, 2025 2:15 pm

Share

Recent Posts

అనస్వరకు అంత డిమాండ్ ఉందా?

మలయాళం నుంచి కథానాయికలను తెలుగులోకి తీసుకురావడం కొత్త కాదు. నయనతార, మమత మోహన్ దాస్, కీర్తి సురేష్ లాంటి చాలామంది…

1 hour ago

‘రాకా’ లెవెలే వేరంటున్న నటుడు

పుష్ప, పుష్ప-2 సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. ఈ సినిమాల తర్వాత బన్నీ…

1 hour ago

ఇప్పుడు ఎంత ఏడ్చినా ఏం లాభం?

అడుసు తొక్కనేల…కాలు కడగనేల..అనే సామెతను పెద్దలు ఊరికే వేయలేదు. ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవారు,…

2 hours ago

బాలయ్య కొడుకు కోసం కొత్త ముహూర్తం?

మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ రెండు దశాబ్దాల కిందటే తెరంగేట్రం చేశాడు. అక్కినేని నాగార్జున ఇద్దరు కొడుకులూ ఒకరి…

4 hours ago

లోక‌ల్‌వార్‌లో జ‌న‌సేన కోరిక‌లు బాబు తీర్చేనా..?

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల వేళ సీట్ల స‌ర్దుబాటు విష‌యంలో జ‌న‌సేన నాయ‌కుల కోరిక‌లకు కూట‌మి పెద్ద టీడీపీ గ్రీన్‌సిగ్న‌ల్…

6 hours ago

మారెమ్మకు మాస్ రాజా ప్రోత్సాహం సరిపోతుందా

స్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నాడు. మాస్ మహారాజ తమ్ముడు కొడుకు మాధవ్ భూపతిరాజుని హీరోగా పరిచయం చేస్తూ…

6 hours ago