హీరో వెంకటేష్ కన్నా ఎక్కువగా సంక్రాంతికి వస్తున్నాంని పండగ బరిలో దింపాలనే పట్టుదల దర్శకుడు అనిల్ రావిపూడిదనే విషయం ఓపెన్ సీక్రెట్. గేమ్ ఛేంజర్ లాంటి ప్యాన్ ఇండియా మూవీ ఉన్నా నిర్మాత దిల్ రాజు మీద ఒత్తిడి చేసి ఒప్పించడంలో సక్సెసయ్యాడు కాబట్టే ఇవాళ ఇది సాధ్యమయ్యింది.
టైటిల్ కూడా దానికి తగ్గట్టు ఉండటంతో నో అనేందుకు ఆస్కారం లేకుండా పోయింది. ఇక అక్కడి నుంచి ప్రమోషన్లు నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోయాయి. వెరైటీ, చిత్ర విచిత్రం అంటూ ఏవేవో కామెంట్లు వచ్చినా సరే పబ్లిసిటీ బ్రహ్మాండంగా వర్కౌట్ అయ్యింది. భీమ్స్ పాటలు భీభత్సమైన హైప్ తీసుకొచ్చాయి.
కట్ చేస్తే ఇప్పుడీ పంతానికి ఫలితం కనిపిస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం అడ్వాన్స్ బుకింగ్స్ మహా జోరుగా ఉన్నాయి. రెండు రోజుల ముందే ట్రెండింగ్ లోకి వచ్చేసింది. థియేటర్ లిస్టు పూర్తిగా ఫైనల్ కాకముందే అందుబాటులో వచ్చిన థియేటర్లన్నీ హౌస్ ఫుల్స్ పడే దిశగా పరుగులు పెడుతున్నాయి.
బుక్ మై షోలో రెండు లక్షల టికెట్లు దాటేయడం చూస్తే ఫ్యామిలీ ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో అంచనాలున్నాయో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా రేపటి నుంచి వీకెండ్ దాకా ఏబీసీ తేడా లేకుండా టికెట్లు దొరకాలంటే చిన్న పాటి యుద్ధం చేయాల్సి రావొచ్చనేది వెంకటేష్ అభిమానుల అంచనా.
ఒకపక్క గేమ్ ఛేంజర్ బాగా నెమ్మదించింది. డాకు మహారాజ్ వైపు మాస్ జనాలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. కుటుంబం మొత్తం వెళ్లాలనుకుంటే మాత్రం దానికి సంక్రాంతికి వస్తున్నాం ఫస్ట్ ఛాయసవుతోంది. ఎప్పుడూ లేనంత యాక్టివ్ గా వెంకటేష్ ఈ సినిమాని పబ్లిక్ లోకి తీసుకెళ్లిన వైనం జనాల్లోకి చొచ్చుకుని వెళ్ళింది.
ఒక శాటిలైట్ ఛానల్ నిర్వహించిన ఈవెంట్ కు సైతం వెళ్లి భేషజం లేకుండా స్టేజి డాన్స్ చేయడం చిన్న ఉదాహరణ మాత్రమే. ఎపిలో టికెట్ రేట్ల పెంపు ఇవ్వడం వసూళ్ల పరంగా మరో సానుకూలాంశం. ఉదయం ఆటకు పాజిటివ్ కాదు యావరేజ్ టాక్ వచ్చినా చాలు వెంకీ ఆట మాములుగా ఉండదు.
This post was last modified on January 13, 2025 11:59 am
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…