Movie News

మల్టీప్లెక్సుల కోసం ఆ ఐదు సినిమాలు రెడీ

కరోనా-లాక్‌డౌన్ కారణంగా మార్చి రెండో వారంలో మూతపడ్డ థియేటర్లలను ఈ గురువారం నుంచి థియేటర్లను తెరుచుకోవడానికి అనుమతులు లభించిన సంగతి తెలిసిందే. ఐతే థియేటర్లకు పండుగ రోజంటే కొత్త చిత్రాలు విడుదలయ్యే శుక్రవారమే కాబట్టి ఆ రోజు నుంచే థియేటర్లు తెరుచుకోబోతున్నాయి. కానీ అన్నీ మాత్రం కాదు.

దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా సింగిల్ స్క్రీన్లు తెరుచుకుంటున్న దాఖలాలైతే కనిపించడం లేదు. లీడింగ్ మల్టీప్లెక్స్ ఛైన్స్ మాత్రం స్క్రీన్లను పున:ప్రారంభించడానికి రంగం సిద్ధం చేశాయి. శానిటైజేషన్ సహా అన్నీ చేసి స్క్రీన్లను తెరుస్తున్నాయి. మరి వీటిలో ప్రదర్శించడానికి సినిమాలేవన్నది ప్రశ్న. కొత్త చిత్రాలైతే ఏవీ విడుదల కావట్లేదు. ఓటీటీల్లో నడుస్తున్న సినిమాలను థియేటర్లలో నడిపించే పరిస్థితి లేదు.

ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌కు ముందు థియేటర్లలో ఆడుతున్న సినిమాలనే రీ రిలీజ్ చేయబోతున్నారు. బాలీవుడ్లో ఐదు సినిమాల రీ రిలీజ్ గురించి ప్రకటన కూడా వచ్చింది. జనవరిలో విడుదలై దాదాపు రూ.300 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో ఈ ఏడాదికి ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన అజయ్ దేవగణ్ సినిమా ‘తానాజీ’ ఈ వీకెండ్లో థియేటర్లలోకి రాబోతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో జనాల్ని ఓ మోస్తరుగా అయినా థియేటర్లకు ఆకర్షించగల సినిమా ఇదే అని భావిస్తున్నారు. దీంతో పాటు తాప్సి హిట్ చిత్రం ‘తప్పడ్’, ఆయుష్మాన్ ఖురాని సక్సెస్ ఫుల్ మూవీ ‘శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్’ కూడా ఈ వీకెండ్లో థియేటర్లలోకి దిగుతున్నాయి.

డిజాస్టర్‌గా నిలిచిన ఆదిత్యరాయ్ కపూర్ ‘మలంగ్’ కూడా రీ రిలీజ్ కాబోతోంది. దివంగత సుశాంత్ రాజ్‌పుత్‌తో కలిసి సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ చేసిన తన డెబ్యూ మూవీ ‘కేదార్ నాథ్’ కూడా మళ్లీ థియేటర్లలో సందడి చేయబోతోంది. మరి ఈ ఐదు సినిమాలు ప్రస్తుత పరిస్థఇతుల్లో ఏమేర ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తాయో చూడాలి.

This post was last modified on October 15, 2020 10:00 am

Share

Recent Posts

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

19 minutes ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

1 hour ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

8 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

10 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

11 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

11 hours ago