Movie News

మోకాళ్లపై వెంకన్న చెంతకు టాలీవుడ్ హీరోయిన్

హీరోయిన్ లు అంటే… చాలా సున్నితంగా, సుకుమారంగా ఉంటారు. అయితేనేం… వారిలోని భక్తి ఒక్కోసారి వారి చేత వండర్లు చేయిస్తూ ఉంటుంది. ఇలాంటి సమయాల్లోనే మనం ఆశ్చర్యపోయే దృశ్యాలను చూస్తూ ఉంటాం. అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టాలీవుడ్ లో పలు హిట్ సినిమాల్లో నటించిన హీరోయిన్ నందినీ రాయి… మోకాళ్లపై వెళ్లి కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. అలిపిరి నుంచి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకున్న నందినీ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మోకాళ్ల పర్వతం వద్ద ఆమె తన మోకాళ్లపై మెట్లు ఎక్కుతున్న వీడియో ఆమోలోని భక్తి ప్రపత్తులను తెలియజేస్తోంది.

తమిళ స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించిన వారసుడు చిత్రంలో శ్రీకాంత్ కు జోడిగా నందినీ రాయి నటించారు. సీనియర్ డైరెక్టర్ నీలకంఠ తెరకెక్కించిన మాయ చిత్రంలోనూ ఆమె లీడ్ రోల్ లో కనిపించింది.

ఇక సుధీర్ బాబు హీరోగా నటించిన మోసగాళ్లకు మోసగాడు సినిమాలోనూ నటించింది. వీటితో పాటు మరికొన్ని సినిమాల్లోనూ నటించినా నందినికి పెద్దగా గుర్తింపు రాలేదు. అయినా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ సాగుతున్న నందిని… తాజాగా పలు సినిమాల్లో అవకాశాలను చేజిక్కించుకుంది.

ఈ క్రమంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు ఆమె తిరుమల వెళ్లారు. ఈ సందర్భంగా కాలి నడకన తిరుమల కొండ ఎక్కాలని నిర్ణయించుకున్న నందిని అలిపిరి నుంచి మెట్ల మార్గం మీదుగా వెంకన్న వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మోకాళ్ల పర్వతం వద్ద ఆమె మెట్లను మోకాళ్లపై ఎక్కుతూ కనిపించారు.

సెలబ్రిటీ అయి ఉండి.. అది కూడా హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించిన నందిని ఇలా మోకాళ్లపై మెట్లు ఎక్కుతుండటం పలువురు భక్తులను ఆశ్చర్యానికి గురి చేసింది. మోకాళ్లపై వెంకన్న వద్దకు వెళుతున్న తన వీడియోను నందిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా…ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారిపోయింది.

This post was last modified on January 11, 2025 3:50 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

2 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

3 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

4 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

5 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

5 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

7 hours ago