నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా చిత్రం డాకు మహారాజ్ ఆదివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస హిట్లతో మంచి జోరు మీద ఉన్నబాలయ్య.. బాబీ దర్శకత్వంలో చేసిన డాకుపై ఓ రేంజిలో అంచనాలు ఉన్నాయి. సరిగ్గా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సిన ముందు రోజు తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోవడం చిత్ర యూనిట్ ను షాక్ కు గురి చేసింది. నటుడిగానే కాకుండా హిందూపురం ఎమ్మెల్యేగానూ కొనసాగుతున్న బాలయ్య… ఈ ఘటనకు సంతాప సూచకంగా అనంతపురంలో తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేసుకున్నారు. అయితే చిత్ర యూనిట్ అభ్యర్థన మేరకు శుక్రవారం హైదరాబాద్ లో డాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.
ఈ వేడుకకు హాజరైనా కూడా బాలయ్య,… తిరుపతి తొక్కిసలాటను మరిచిపోలేకపోయారు. సినిమా ఫంక్షన్ అయినప్పటికీ… తిరుపతి ప్రమాదాన్ని ప్రస్తావించిన బాలయ్య… తన సున్నిత మనస్తత్వాన్ని ఆవిష్కరించారు. తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన చాలా బాధాకరమని బాలయ్య అన్నారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వెంకన్న భక్తుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తిరుపతిలో ఈ తరహా ఘటనలు ఇప్పటిదాకా జరగలేదన్న బాలయ్య… పవిత్ర పుణ్యక్షేత్రంలో జరగకూడని ఘటన జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
సాధారణంగా సినిమా ఫంక్షన్లలో విషాద ఘటనలను నటులు గానీ, సినీ ప్రముఖులు గానీ పెద్దగా ప్రస్తావించరు. ఎంతసేపు తాము తెరకెక్కించిన సినిమా విజయవంతం కావాలన్న జోష్ లో కొనసాగే సినీ జనం… ప్రీ రిలీజ్ వంటి ఫుల్ జోష్ కనిపించే పంక్షన్లలో అసలు ప్రస్తావించరు. ఇక బాలయ్య లాంటి ఓ రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటులు అయితే ఈ ఘటనల జోలికే వెళ్లరు. అయితే అందుకు విరుద్ధంగా ఎంత సినిమా వేదిక అయినా కూడా తన మనసును కలచివేసిన తిరుపతి తొక్కిసలాటను బాలయ్య ప్రీ రిలీజ్ వేదిక మీద ప్రస్తావించకుండా ఉండలేకపోయారు. బాలయ్య వ్యాఖ్యలు ఆయనలోని సున్నితత్వానికి నిదర్శనమని ఆయన అభిమానులు కొనియాడుతున్నారు.
This post was last modified on January 11, 2025 10:29 am
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…